News January 2, 2025

పరిమితి లేకుండా సాగు చేసే అందరికీ రైతుభరోసా!

image

TG: సాగు చేసే రైతులందరికీ రైతుభరోసా ఇవ్వాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఐటీ చెల్లింపు, భూమి పరిమితి పెట్టవద్దని అభిప్రాయపడింది. సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగుభూములను ప్రభుత్వం గుర్తించనుంది. రైతుభరోసా కోసం జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. సంక్రాంతి (జనవరి 14) నుంచి ఈ స్కీంను అమలు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం.

Similar News

News January 31, 2026

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియాలో పోస్టులు

image

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా(THDC)లో 100 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ITI, BE, BTech, BBA అర్హతగల వారు www.apprenticeshipindia.org పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తును, డాక్యుమెంట్స్‌ను పోస్ట్ చేయాలి. అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైట్: https://thdc.co.in

News January 31, 2026

రెండు రోజుల్లో రూ.75వేలు తగ్గిన కేజీ సిల్వర్ రేటు

image

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు అమాంతం పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కేజీ సిల్వర్ రేటు ఇవాళ ఒక్కరోజే రూ.55వేలు పతనమై రూ.3,50,000కు చేరింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.75వేలు తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిస్తే.. ఇన్వెస్టర్లకు భారీ నష్టాలనిచ్చింది. అలాగే రెండు రోజుల్లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.18,270 క్షీణించగా 22 క్యారెట్ల 10gల గోల్డ్ రేటు రూ.16,750 తగ్గడం విశేషం.

News January 31, 2026

శ్రీవారి డాలర్ విక్రయాలు తాత్కాలికంగా నిలిపివేత

image

AP: తిరుమలలోని శ్రీవారి డాలర్ విక్రయ కేంద్రాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. బంగారం ధరలు రోజూ మారుతుంటే ఇక్కడ మాత్రం మంగళవారం సాయంత్రమే ధర సవరిస్తుండటంతో TTD నష్టపోతోంది. దీంతో విక్రయ పద్ధతుల్లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. మార్కెట్‌కు అనుగుణంగా రోజూ ధరలు మార్చడం, దర్శనం టికెట్ ఉన్న వారికే ఒక డాలర్ చొప్పున అమ్మాలి, రూ.50వేలు దాటితే PAN నంబర్ తప్పనిసరి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.