News January 2, 2025

పరిమితి లేకుండా సాగు చేసే అందరికీ రైతుభరోసా!

image

TG: సాగు చేసే రైతులందరికీ రైతుభరోసా ఇవ్వాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఐటీ చెల్లింపు, భూమి పరిమితి పెట్టవద్దని అభిప్రాయపడింది. సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగుభూములను ప్రభుత్వం గుర్తించనుంది. రైతుభరోసా కోసం జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. సంక్రాంతి (జనవరి 14) నుంచి ఈ స్కీంను అమలు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం.

Similar News

News January 19, 2025

ట్రంప్‌తో ముకేశ్- నీతా అంబానీ

image

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రేపు ప్రమాణం చేయనున్నారు. ఈ వేడుకకు వివిధ దేశాల ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే, దీనికి ముందే ట్రంప్ ఏర్పాటు చేసిన ‘క్యాండిల్ లైట్ డిన్నర్’కు భారత కుబేరుడు ముకేశ్ అంబానీ తన భార్య నీతా అంబానీతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో వీరు దిగిన ఫొటో వైరలవుతోంది. కాగా, ప్రమాణస్వీకారోత్సవం తర్వాత మార్క్ జుకర్‌బర్గ్ ఇచ్చే డిన్నర్‌లోనూ వీరు పాల్గొననున్నారు.

News January 19, 2025

‘పరీక్షా పే చర్చ’కు భారీగా అప్లికేషన్లు

image

ప్రధాని మోదీ నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి 3.5 కోట్లకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షల సందర్భంగా ఒత్తిడికి గురి కాకుండా ఉండటంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మోదీ చర్చిస్తారు. కాగా పరీక్షా పే చర్చా ఎడిషన్-8 నిర్వహణ తేదీ ఇంకా ప్రకటించలేదు.

News January 19, 2025

చరిత్ర సృష్టించిన ‘పుష్ప-2’!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం రీలోడెడ్ వెర్షన్‌ విడుదలవగా చాలా చోట్ల హౌస్ ఫుల్‌గా నడుస్తోంది. దీంతో రిలీజైన 45వ రోజున కూడా ఓ సినిమాకు హౌస్ ఫుల్ పడటం ఇదే తొలిసారి అని సినీవర్గాలు పేర్కొన్నాయి. 20+నిమిషాలు యాడ్ అవడం సినిమాకు ప్లస్ అయినట్లు తెలిపాయి. ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.