News January 3, 2025
ఎన్డీయేలో చేరాలన్న ఒత్తిడి మాపై లేదు: అబ్దుల్లా
NDAలో చేరాలని తమపై ఎవరూ ఒత్తిడి తేవడం లేదని, ఆ వార్తల్లో నిజం లేదని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ‘BJP మాపై ఎటువంటి ఒత్తిడీ తీసుకురావట్లేదు. మా సర్కారును అస్థిరపరిచే ప్రయత్నాలేవీ చేయమని అగ్రనాయకత్వం మాట ఇచ్చింది. గతంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఇచ్చిన సహకారాన్ని నాకూ అందిస్తామని హామీ లభించింది’ అని తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
Similar News
News January 7, 2025
ఇంగ్లండ్‌తో సిరీస్.. బుమ్రాకు రెస్ట్!
ఈనెల 22 నుంచి ఇంగ్లండ్ ప్రారంభమయ్యే సిరీస్‌కు భారత స్టార్ పేసర్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడిపై విపరీతమైన పనిభారం పడటమే అందుకు కారణం. గత 4 నెలల్లో బుమ్రా 10 టెస్టులు ఆడారు. BGTలో మొత్తం 150 ఓవర్లు వేయగా.. మెల్‌బోర్న్ టెస్టులోనే 53.2 ఓవర్లు బౌలింగ్ చేశారు. ఇప్పటికే బుమ్రా AUSతో చివరి టెస్ట్‌లో గాయపడ్డారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమయ్యేందుకు అతడికి విశ్రాంతి ఇవ్వనున్నారు.
News January 7, 2025
hMPV గురించి సౌమ్య స్వామినాథన్ ఏమన్నారంటే?
ప్రస్తుతం భారత్‌లో వ్యాపిస్తున్న hMP వైరస్ గురించి ఆందోళన వద్దని WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ డా.సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఇది కొత్తగా వచ్చిందేమీ కాదని, గతంలోనే ఉందన్నారు. ఈ వైరస్ వల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందని, జలుబు చేసినప్పుడు నార్మల్‌గా తీసుకునే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి బయటపడొచ్చని వెల్లడించారు. కాగా 2019లో కరోనా సమయంలో సౌమ్య WHOలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేశారు.
News January 7, 2025
సింగిల్ పేరెంట్‌గా లైఫ్ ఎలా ఉంది? సానియా సమాధానమిదే
సానియా మీర్జా, షోయబ్ మాలిక్ గతేడాది JANలో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరి అబ్బాయి ఇప్పుడు సానియా వద్దే ఉంటున్నారు. ఈక్రమంలోనే సింగిల్ పేరెంట్‌గా జీవితం ఎలా ఉందని ఆమెకు ప్రశ్న ఎదురైంది. అయితే ప్రస్తుతం తన ప్రపంచమంతా కొడుకు ఇజానేనని సానియా తెలిపారు. అతడిని ఎప్పుడూ విడిచి పెట్టి ఉండటానికి ఇష్టపడనని చెప్పుకొచ్చారు. అటు వర్క్‌ని, కొడుకు బాగోగులను బ్యాలెన్స్ చేసుకుంటున్నట్లు వెల్లడించారు.