News January 3, 2025
ఎన్డీయేలో చేరాలన్న ఒత్తిడి మాపై లేదు: అబ్దుల్లా
NDAలో చేరాలని తమపై ఎవరూ ఒత్తిడి తేవడం లేదని, ఆ వార్తల్లో నిజం లేదని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ‘BJP మాపై ఎటువంటి ఒత్తిడీ తీసుకురావట్లేదు. మా సర్కారును అస్థిరపరిచే ప్రయత్నాలేవీ చేయమని అగ్రనాయకత్వం మాట ఇచ్చింది. గతంలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఇచ్చిన సహకారాన్ని నాకూ అందిస్తామని హామీ లభించింది’ అని తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
Similar News
News January 17, 2025
విరాట్ కోహ్లీకి గాయం!.. రంజీల్లో ఆడతాడా?
విరాట్ కోహ్లీ మెడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. దీనికి ఇంజెక్షన్ కూడా తీసుకున్నారని, రంజీ ట్రోఫీలో ఆయన ఆడటంపై సందిగ్ధత నెలకొందని పేర్కొన్నాయి. ఆయన ఢిల్లీ టీమ్‌తో ట్రావెల్ అవుతారని, పూర్తిగా కోలుకుంటేనే ఆడతారని తెలుస్తోంది. గాయం నుంచి కోలుకోకుంటే ప్రాక్టీస్‌కు మాత్రమే పరిమితం కానున్నారు. త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండటంతో ఈ వార్త ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.
News January 17, 2025
ACCIDENT: 9 మంది దుర్మరణం
మహారాష్ట్రలోని నాసిక్-పుణే హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఐచర్ ప్యాసింజర్లతో వెళ్తోన్న మాక్సిమోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో మాక్సిమో ముందున్న బస్సును ఢీకొంది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం ధాటికి మాక్సిమో నుజ్జునుజ్జయింది. పుణే సమీపంలోని నారాయణ్‌గావ్ రోడ్డుపై ఈ యాక్సిడెంట్ అయింది.
News January 17, 2025
ఆర్థిక వ్యవస్థలో అమెరికాను దాటనున్న ఇండియా!
రానున్న 50 ఏళ్లలో ఇండియా జీడీపీ భారీగా పెరుగుతుందని ‘గోల్డ్‌మన్ సాక్స్’ అంచనా వేసింది. 2075 నాటికి ఇండియా $52.5 ట్రిలియన్‌తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది. $57 ట్రిలియన్‌తో చైనా జీడీపీలో నంబర్ 1గా మారనుందని తెలిపింది. కాగా, మూడో స్థానంలో USA ($51.5 ట్రిలియన్), నాలుగో ప్లేస్‌లో ఇండోనేషియా ($13.7ట్రి), ఐదో స్థానంలో నైజీరియా ($13.1ట్రి) ఉంటాయని వెల్లడించింది.