News January 3, 2025
దీపాదాస్ మున్షీని మార్చనున్న AICC?
TG: రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షీపై కాంగ్రెస్ అధిష్ఠానం గుర్రుగా ఉందా? ఆమెను తప్పించాలని భావిస్తోందా? గాంధీభవన్‌లో ఇదే చర్చ నడుస్తోంది. ఆమె నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయని, వ్యవహరించే తీరు బాగాలేదని పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెను తప్పించి మరొకరికి ఆ బాధ్యతల్ని అప్పగించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 7, 2025
hMP వైరస్ వ్యాప్తి.. గాంధీ ఆసుపత్రి సిద్ధం!
TG: hMPV కరోనా అంత ప్రమాదకరం కాదని గాంధీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇది సాధారణ ఇన్‌ఫ్లూయెంజా మాత్రమేనని, 4 నుంచి 7 రోజుల్లో తగ్గిపోతుందన్నారు. అటు బాధితులకు గాంధీలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సుమారు 600 ఆక్సిజన్ బెడ్స్, 450కి పైగా వెంటిలేటర్లు, 400 మానిటర్లు, 40వేల కి.లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు, వందలాది ఆక్సిజన్ సిలిండర్లు, పీడియాట్రిక్ వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
News January 7, 2025
ఇంగ్లండ్‌తో సిరీస్.. బుమ్రాకు రెస్ట్!
ఈనెల 22 నుంచి ఇంగ్లండ్ ప్రారంభమయ్యే సిరీస్‌కు భారత స్టార్ పేసర్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడిపై విపరీతమైన పనిభారం పడటమే అందుకు కారణం. గత 4 నెలల్లో బుమ్రా 10 టెస్టులు ఆడారు. BGTలో మొత్తం 150 ఓవర్లు వేయగా.. మెల్బోర్న్ టెస్టులోనే 53.2 ఓవర్లు బౌలింగ్ చేశారు. ఇప్పటికే బుమ్రా AUSతో చివరి టెస్ట్‌లో గాయపడ్డారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమయ్యేందుకు అతడికి విశ్రాంతి ఇవ్వనున్నారు.
News January 7, 2025
hMPV గురించి సౌమ్య స్వామినాథన్ ఏమన్నారంటే?
ప్రస్తుతం భారత్‌లో వ్యాపిస్తున్న hMP వైరస్ గురించి ఆందోళన వద్దని WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ డా.సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఇది కొత్తగా వచ్చిందేమీ కాదని, గతంలోనే ఉందన్నారు. ఈ వైరస్ వల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందని, జలుబు చేసినప్పుడు నార్మల్‌గా తీసుకునే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి బయటపడొచ్చని వెల్లడించారు. కాగా 2019లో కరోనా సమయంలో సౌమ్య WHOలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేశారు.