News January 3, 2025
దీపాదాస్ మున్షీని మార్చనున్న AICC?
TG: రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీపై కాంగ్రెస్ అధిష్ఠానం గుర్రుగా ఉందా? ఆమెను తప్పించాలని భావిస్తోందా? గాంధీభవన్‌లో ఇదే చర్చ నడుస్తోంది. ఆమె నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయని, వ్యవహరించే తీరు బాగాలేదని పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెను తప్పించి మరొకరికి ఆ బాధ్యతల్ని అప్పగించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 14, 2025
విద్యుత్ ఛార్జీల పెంపు లేనట్టే!
TG: వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలను పెంచొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఛార్జీల పెంపునకు డిస్కంలు అనుమతి కోరగా తిరస్కరించింది. ప్రస్తుత ఛార్జీలనే కొనసాగించాలని ఆదేశించింది. ఇదే విషయాన్ని పేర్కొంటూ ERCకి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ మేరకు ఈనెల 18న డిస్కంలు తమ ప్రతిపాదనలను ERCకి సమర్పించే ఛాన్సుంది. డిస్కంల నష్టాల మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తేనే ఛార్జీల పెంపు ఉండదని సమాచారం.
News January 14, 2025
ALERT.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: కన్యాకుమారి సమీపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతిలో ఇవాళ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. నిన్న నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతితో సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. మరోవైపు ఉత్తర కోస్తాలో చలి తీవ్రత కొనసాగుతోంది.
News January 14, 2025
Way2News: 24 గంటలూ వార్తల ‘పండుగే’
‘ఈరోజు సంక్రాంతి సెలవు కారణంగా రేపు పేపర్ రాదు. పునర్దర్శనం గురువారం’ అని వార్తాపత్రికల్లో చదువుతుంటాం. ఈరోజు వార్తలను చదివేందుకు మీరు మరుసటి రోజు వరకు వేచిచూడాల్సిన పని లేదు. ఎప్పటిలాగే పండుగ నాడు కూడా Way2News ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. సెలవుల్లోనూ 24/7 బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, సినిమాలు, స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ కంటెంట్ వస్తూనే ఉంటాయి.
*Way2News యూజర్లకు సంక్రాంతి శుభాకాంక్షలు