News January 3, 2025
వారికి నియామక పత్రాలు ఎప్పుడిస్తారు?: RSP
TG: జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. టీచర్లు, స్టాఫ్ నర్సులు, కాలేజీ లెక్చరర్లు, గ్రూప్-4 అభ్యర్థులకు ఇచ్చి వీరికి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఆలస్యం వెనుక ఉన్న కారణమేంటని, ప్రజా ప్రభుత్వమంటే ఇదేనా అని నిలదీశారు. ఇలానే ఉంటే రాష్ట్ర ప్రజలు అధికారం నుంచి తప్పిస్తారని పేర్కొన్నారు.
Similar News
News January 7, 2025
శ్రీతేజ్‌ను పరామర్శించనున్న అల్లు అర్జున్!
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. ఇవాళ కిమ్స్ ఆస్పత్రికి ఆయన వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్తే ముందే తమకు సమాచారం ఇవ్వాలని ఆయనకు పోలీసులు <<15079293>>నోటీసులు<<>> ఇచ్చిన సంగతి తెలిసిందే.
News January 7, 2025
వరికి బీమా గడువు 15 వరకు పొడిగింపు
AP: వరి పంటకు ప్రీమియం చెల్లింపు గడువును ఈ నెల 15 వరకు బీమా కంపెనీలు పెంచాయి. జీడి పంటకు గత ఏడాది నవంబర్ 22, మిగతా అన్ని పంటలకు డిసెంబర్ 31తోనే గడువు ముగిసింది. వీటికి కూడా ప్రీమియం చెల్లింపునకు మరింత అవకాశం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. గత ఏడాది 43.82 లక్షల మంది రైతులకు బీమా లభించగా, ఈసారి రబీలో 7.6 లక్షల మందికే కవరేజ్ లభించిందని పేర్కొంటున్నారు.
News January 7, 2025
చైనా వైరస్.. వ్యాపించేది ఇలా
దేశంలో hMPV కేసులు కలకలం రేపుతున్నాయి. ఈ వైరస్ సోకినవారు తుమ్మినా, దగ్గినా వెలువడే తుంపర్ల ద్వారా, వారితో సన్నిహితంగా మెలగడం వల్ల ఇతరులకు వ్యాపిస్తుంది. నవజాత శిశువులు, ఐదేళ్లలోపు పిల్లలు, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిపై ప్రభావం ఎక్కువ. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 3-6 రోజుల తర్వాత లక్షణాలు(జలుబు, దగ్గు, జ్వరం, ఊపిరి ఆడకపోవడం) కన్పిస్తాయి.