News January 3, 2025

వారికి నియామక పత్రాలు ఎప్పుడిస్తారు?: RSP

image

TG: జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. టీచర్లు, స్టాఫ్ నర్సులు, కాలేజీ లెక్చరర్లు, గ్రూప్-4 అభ్యర్థులకు ఇచ్చి వీరికి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఆలస్యం వెనుక ఉన్న కారణమేంటని, ప్రజా ప్రభుత్వమంటే ఇదేనా అని నిలదీశారు. ఇలానే ఉంటే రాష్ట్ర ప్రజలు అధికారం నుంచి తప్పిస్తారని పేర్కొన్నారు.

Similar News

News January 22, 2025

CHAMPIONS TROPHY: పాకిస్థాన్‌కు మరో షాక్?

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఓపెనింగ్ సెర్మనీ పాకిస్థాన్ ఆవల జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రెస్ కాన్ఫరెన్స్, కెప్టెన్ల ఫొటో షూట్‌ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్ వెళ్లడం లేదని సమాచారం. రోహిత్ కోసమే ఓపెనింగ్ సెర్మనీ వేదిక మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఫిబ్రవరి 19న టోర్నీ ప్రారంభం కావాల్సి ఉండగా స్టేడియాల మరమ్మతులు ఇంకా ఫినిష్ చేయలేక పాక్ కిందా మీదా పడుతోంది.

News January 22, 2025

భార్యతో సెల్ఫీ ఎంత పని చేసింది

image

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి చెందిన విషయం తెలిసిందే. భార్యతో దిగిన సెల్ఫీనే తన మరణానికి దారితీస్తుందని ఆయన ఊహించి ఉండకపోవచ్చు. చలపతి భార్య అరుణ కూడా మావోయిస్టు పార్టీలో ఉన్నారు. 2016లో వారిద్దరూ కలిసి దిగిన సెల్ఫీ ఫోన్ పోలీసులకు చిక్కింది. దీని ఆధారంగా లొకేషన్‌ ట్రేస్ చేశారు. పక్కా సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దాడి చేయడంతో చలపతి సహా 27 మంది మావోలు చనిపోయారు.

News January 22, 2025

ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌ను కలిసిన సైఫ్

image

ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కలిశారు. తనను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి రక్షించినందుకు ఆయనకు సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే ఇతరులకు కూడా సహాయం అందించాలని ఆటోడ్రైవర్‌కు సూచించారు. సైఫ్ వెంట ఆయన తల్లి షర్మిలా ఠాగూర్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా భజన్ సింగ్‌కు సైఫ్ రివార్డు ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి.