News January 4, 2025
నేటి నుంచి జూ.కాలేజీల్లో మధ్యాహ్న భోజనం
AP: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు కానుంది. మంత్రి నారా లోకేశ్ విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే 1.48లక్షల మందికి ఈ పథకంతో లబ్ధి చేకూరనుంది. దాదాపు 400కాలేజీలను సమీపంలోని స్కూళ్లకు, మిగతా వాటిని సెంట్రలైజ్డ్ కిచెన్‌లకు అటాచ్ చేయగా అక్కడ భోజనం తయారు చేసి కాలేజీలకు పంపనున్నారు.
Similar News
News January 7, 2025
వైఎస్ జగన్‌కు హైకోర్టులో ఊరట
AP: మాజీ CM YS జగన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఐదేళ్ల గడువుతో ఆయనకు పాస్‌పోర్టు మంజూరు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబరు 20న జగన్ పాస్‌పోర్టు గడువు ముగిసింది. తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టుకు NOC ఇచ్చేలా ఆదేశించాలన్న ఆయన విజ్ఞప్తిని ప్రజాప్రతినిధుల కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పు వెలువడింది.
News January 7, 2025
ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేపై అభ్యంతరాల గడువు పెంపు
AP: ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేపై అభ్యంతరాల సమర్పణ గడువును ఈ నెల 12 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన గడువు ఇవాళ్టితో ముగియనుండటంతో మరో 5 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సర్వే వివరాలు ప్రచురించి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాల అనంతరం ఈ నెల 20వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నారు.
News January 7, 2025
కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన అఖిలేశ్
కాంగ్రెస్ పార్టీకి SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ షాక్ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఆప్‌నకు మరోసారి రావాలని గతంలోనూ ఆయన ఆకాంక్షించారు. తమకు మద్దతిచ్చినందుకు కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. యూపీతో సరిహద్దును పంచుకొనే ఢిల్లీలో అఖిలేశ్ మద్దతు తమకు లాభం చేకూరుస్తుందని ఆప్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.