News January 4, 2025

నేటి నుంచి జూ.కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

image

AP: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు కానుంది. మంత్రి నారా లోకేశ్ విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే 1.48లక్షల మందికి ఈ పథకంతో లబ్ధి చేకూరనుంది. దాదాపు 400కాలేజీలను సమీపంలోని స్కూళ్లకు, మిగతా వాటిని సెంట్రలైజ్డ్ కిచెన్‌లకు అటాచ్ చేయగా అక్కడ భోజనం తయారు చేసి కాలేజీలకు పంపనున్నారు.

Similar News

News January 19, 2025

బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం!

image

వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో తేలిగ్గా అర్థం చేసుకునే విధంగా ఈ ప్రతిపాదిత బిల్లు ఉండనుంది. ప్రస్తుత చట్టంలో 298 సెక్షన్లు, 23 చాప్టర్లు ఉన్నాయి. కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.

News January 19, 2025

ఉదయాన్నే గోరువెచ్చటి నీళ్లు తాగితే..

image

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తనాళాలు చురుగ్గా మారి రక్త ప్రసరణ వ్యవస్థ వేగవంతం అవుతుంది. గొంతు నొప్పి, జలుబు, దగ్గు, కఫం సమస్యలు తొలగిపోతాయి. ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. బరువు తగ్గుతారు. శరీరంలోని మలినాలు బయటకు వెళ్లి చర్మంపై ముడతలు తగ్గుతాయి.
SHARE IT

News January 19, 2025

U19 WC: నేడు ఇండియాVSవెస్టిండీస్

image

ICC ఉమెన్స్ U19 వరల్డ్ కప్‌లో ఇవాళ భారత్ వెస్టిండీస్‌తో తలపడనుంది. మ.12 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచును స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ TV ఛానల్స్‌లో చూడవచ్చు. IND కెప్టెన్‌గా నికి ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఆసియా కప్‌లో టాప్ రన్ స్కోరర్ గొంగడి త్రిష, టాప్ వికెట్ టేకర్ ఆయుషి శుక్లా జట్టులో ఉండటం భారత్‌కు బలం. కాగా నేడు జరిగే మరో మ్యాచులో SL, మలేషియా తలపడనున్నాయి.