News March 17, 2024
శ్రీకాకుళం: మొదటిసారి ఎమ్మెల్యేలుగా పోటి

2024 సార్వత్రిక ఎన్నికల బరిలోకి ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పిరియా విజయ మొదటిసారి పోటీకి సిద్ధమవుతున్నారు. శ్రీకాకుళం జడ్పీ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్న పిరియా విజయకు పార్టీ టికెట్ కేటాయించింది. అటు రాజాంలో డాక్టర్‌గా పనిచేస్తున్న తలే రాజేశ్ కూడా మొదటిసారి పోటీకి సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మొదటిసారి కావడంతో వీరికి విజయం వరిస్తుందో..? లేదో..? వేచి చూద్దాం.
Similar News
News March 11, 2026
శ్రీకాకుళం: ఆగి ఉన్న కారును ఢీకొన్న లారీ

శ్రీకాకుళం మండలం జాతీయ రహదారిలో ఉన్న డెంటల్ కాలేజీ వద్ద బుధవారం ఆగి ఉన్న కారును లారీ ఢీకొంది. కారు మరమ్మతులకు గురికావడంతో కారులో ఉన్నవారు దిగి మెకానిక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలోనే నరసన్నపేట నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.
News March 11, 2026
శ్రీకాకుళం: చోరీ కేసులో వ్యక్తికి ఆరునెలలు జైలు శిక్ష

రైళ్లలో ప్రయాణీకుల సెల్ ఫోన్లు, ఛార్జర్లు చోరీకు పాల్పడుతున్న వ్యక్తికి ఆరునెలలు జైలు శిక్ష పడింది. ఒడిశా రాష్ట్రం బరంపురం సమీపంలోని నారాయణపూర్‌కి చెందిన జగదీశ్ రెడ్డి అనే యువకుడికి ఆరునెలలు జైలు శిక్ష విధించినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ సోమేశ్వరరావు మంగళవారం తెలిపారు. చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకుని విచారణ జరిపి విశాఖ రైల్వే కోర్టులో హాజరుపరచడంతో కోర్టు ఈ తీర్పు ఇచ్చిందని ఎస్ఐ పేర్కొన్నారు.
News March 11, 2026
కోడి పందేల శిబిరంపై దాడి: నరసన్నపేట ఎస్సై

నరసన్నపేట మండలం లుకలాం గ్రామంలోని వంశధార నది పరివాహక ప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్నామని ఎస్సై బి.గణేశ్ తెలిపారు. ఈ మేరకు తమ సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం దాడి చేశామని వెల్లడించారు. ఈ దాడిలో ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్లు, రూ.10,700 స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు.


