News March 17, 2024

శ్రీకాకుళం: మొదటిసారి ఎమ్మెల్యేలుగా పోటి

image

2024 సార్వత్రిక ఎన్నికల బరిలోకి ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పిరియా విజయ మొదటిసారి పోటీకి సిద్ధమవుతున్నారు. శ్రీకాకుళం జడ్పీ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్న పిరియా విజయకు పార్టీ టికెట్ కేటాయించింది. అటు రాజాంలో డాక్టర్‌గా పనిచేస్తున్న తలే రాజేశ్ కూడా మొదటిసారి పోటీకి సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మొదటిసారి కావడంతో వీరికి విజయం వరిస్తుందో..? లేదో..? వేచి చూద్దాం.

Similar News

News October 14, 2024

సంతబొమ్మాళిలో వివాహిత అనుమానాస్పద మృతి

image

సంతబొమ్మాళి మండలం తెనిగిపెంట గ్రామానికి చెందిన పెంట రేవతి (19) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈనెల 4వ తేదీ నుంచి రేవతి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈనెల 6వ తేదీన గ్రామంలోని ఒక బావిలో రేవతి మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. అయితే రేవతిది హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News October 14, 2024

SKLM: నేడే లాటరీ.. తీవ్ర ఉత్కంఠ..!

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కొత్తగా నెలకొల్పనున్న 158 మద్యం దుకాణాల నిర్వహణకు ఇవాళ టెండర్లు నిర్వహించనున్నారు. 158 మద్యం దుకాణాలకు 4,671 దరఖాస్తులు అందాయి. దీంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీలు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

News October 14, 2024

SKLM: DSC అభ్యర్థులకు ఉచిత శిక్షణ

image

DSC రాయనున్న SC,ST అభ్యర్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ DD విశ్వమోహన్ రెడ్డి తెలిపారు. అర్హత గల అభ్యర్థులు 3 నెలల పాటు శిక్షణ పొందేందుకు ఈ నెల 21 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. http:jnanabhumi.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 22 నుంచి 25లోగా హల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈ నెల 27న స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందన్నారు.