News January 4, 2025
HMPV వైరస్‌పై TG ప్రభుత్వం కీలక ప్రకటన
చైనాలో విజృంభిస్తోన్న HMPV వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదంది. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, ఇది సాధారణ జలుబు & ఫ్లూ లక్షణాలను కలిగి ఉంటుందని తెలిపింది. జలుబు ఉన్నవారు మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నీరు పుష్కలంగా తాగుతూ పౌష్టికాహారం తినాలి. ఎక్కువగా నిద్రపోవాలి. షేక్ హ్యాండ్స్ వద్దు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మకూడదు’ అని తెలిపింది.
Similar News
News January 8, 2025
విడాకుల రూమర్లు.. చాహల్ పోస్ట్ వైరల్
భార్య ధనశ్రీతో క్రికెటర్ చాహల్ విడాకుల రూమర్లకు ఇంకా తెరపడటం లేదు. దీనిపై వీరిద్దరూ ఇంతవరకు స్పందించలేదు. అలాగని ఖండించనూ లేదు. అయితే తాజాగా చాహల్ ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘అన్ని శబ్దాల మధ్య నిశ్శబ్దాన్ని వినేవారికి అది ఎంతో అందమైన మెలోడిలా అనిపిస్తుంది’ అన్న సోక్రటీస్ మాటలను కోట్ చేశారు. దీంతో చాహల్ పోస్ట్‌కు అర్థమేమై ఉంటుందని అతడి ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
News January 8, 2025
‘పుష్ప-2’కు మ్యూజిక్.. తమన్ క్లారిటీ
‘పుష్ప-2’కు మ్యూజిక్ ఇచ్చానని గతంలో చేసిన వ్యాఖ్యలపై సంగీత దర్శకుడు తమన్ స్పష్టతనిచ్చారు. సినిమా రిలీజ్‌కు తక్కువ సమయం ఉండటంతో BGM ఇవ్వాలని తనను నిర్మాతలు కోరినట్లు తెలిపారు. తాను చేయడం కరెక్టేనా అని అడిగితే అవసరాన్ని బట్టి వినియోగిస్తామని వారు బదులిచ్చినట్లు పేర్కొన్నారు. రీ రికార్డింగ్ సమయంలో సుకుమార్ ఫోన్ నంబర్ తీసుకున్నట్లు తెలిపారు. కాగా సినిమాలో సామ్ సి అందించిన BGMను తీసుకున్నారు.
News January 8, 2025
ఆరోగ్యశ్రీపై చంద్రబాబుకు ఎందుకు అంత కక్ష?: వైఎస్ జగన్
AP: ఆరోగ్యశ్రీపై సీఎంకు ఎందుకంత కక్ష అంటూ మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ‘వైద్యానికి ఎంత ఖర్చైనా ప్రజలు ఉచితంగా చికిత్స పొందేలా పథకాన్ని తీర్చిదిద్దాం. దాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు నాశనం చేస్తోంది? నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టారు. కోటిన్నర కుటుంబాల ఆరోగ్యానికి షూరిటీ లేదు. మీ చర్యల్ని ఖండిస్తున్నా. ఆరోగ్యశ్రీని వెంటనే యథాతథంగా అమలు చేయాలి’ అని డిమాండ్ చేశారు.