News January 4, 2025
HMPV వైరస్‌పై TG ప్రభుత్వం కీలక ప్రకటన
చైనాలో విజృంభిస్తోన్న HMPV వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదంది. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, ఇది సాధారణ జలుబు & ఫ్లూ లక్షణాలను కలిగి ఉంటుందని తెలిపింది. జలుబు ఉన్నవారు మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నీరు పుష్కలంగా తాగుతూ పౌష్టికాహారం తినాలి. ఎక్కువగా నిద్రపోవాలి. షేక్ హ్యాండ్స్ వద్దు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మకూడదు’ అని తెలిపింది.
Similar News
News January 19, 2025
శాంసన్‌కు CTలో నో ప్లేస్.. రాజకీయ దుమారం
సంజూ శాంసన్‌ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకుండా కెరీర్‌ను నాశనం చేశారని MP శశిథరూర్ ఆరోపించారు. ఈ విషయంలో KCAకు బాధ లేదా అని ప్రశ్నించారు. SMAT, VHTల మధ్య ట్రైనింగ్‌కు హాజరుకానందుకు చింతిస్తూ ఆయన లేఖ రాసినా వేటు వేశారని మండిపడ్డారు. ఈ విషయంపై KCA ప్రెసిడెంట్ జార్జ్ స్పందిస్తూ శాంసన్ క్రమశిక్షణ పాటించలేదన్నారు. VHTలో ఆడకపోవడం వల్లే జాతీయ జట్టుకు దూరమయ్యారనేది తాను చెప్పలేనని పేర్కొన్నారు.
News January 19, 2025
రియల్ హీరోస్..!
రెస్టారెంట్లలో నిత్యం వేలాది టన్నుల ఫుడ్ వేస్ట్ అవుతుంది. అలా వేస్ట్ కాకుండా ఫుడ్‌ను అన్నార్థులకు అందించేందుకు కొన్ని NGOలు ముందుకొస్తున్నాయి. కేవలం బెంగళూరులోనే నిత్యం 296 టన్నుల ఫుడ్ వేస్ట్ అవుతుంది. అక్కడ ‘హెల్పింగ్ హీరోస్ ఇండియా’ అనే సంస్థ ఫుడ్ సేకరించి పేదలకిస్తోంది. ముంబైలో రాబిన్ హుడ్ ఆర్మీ&ముంబై డబ్బావాలా, కోల్‌కతా వీ కేర్, చెన్నై&హైదరాబాద్‌లో ‘NO FOOD WASTE’ సంస్థలు సేవలు అందిస్తున్నాయి.
News January 19, 2025
శ్రీవారికి రూ.6 కోట్ల విరాళం
AP: తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు ఒకేసారి రూ.6 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. SVBC కోసం రూ.5 కోట్లు, గోసంరక్షణ ట్రస్టుకు రూ.కోటి విలువైన డీడీలను AEO వెంకయ్య చౌదరికి అందజేశారు. TTDకి చెందిన ట్రస్టులకు ఆయన గతంలోనూ భారీగా విరాళాలు ఇచ్చినట్లు సమాచారం.