News March 17, 2024
ఆదిలాబాద్: DEGREE పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ విడుదల

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెగ్యులర్ డిగ్రీకి సంబంధించిన 2, 4, 6 సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీ విడుదల చేసినట్లు KU అధికారులు తెలిపారు. మార్చి 30 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. అలాగే ఏప్రిల్ 10 వరకు ఫైన్‌తో ఫీజు చెల్లించవచ్చన్నారు. పరీక్షలు మేలో ఉంటాయని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ విద్యార్థులు గమనించాలని కోరారు. SHARE IT
Similar News
News August 21, 2025
ADB: అప్పుల బాధతో SUICIDE

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నేరడిగొండ మండలంలో చోటుచేసుకుంది. కుమారి గ్రామానికి చెందిన పోతగంటి లస్మన్న బుధవారం తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చేసిన అప్పులను ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
News August 20, 2025
ADB: ముంబయిలో వర్షాలు.. 2 రైళ్లు రద్దు

ముంబాయిలో భారీ వర్షాల కారణంగా గురువారం రెండు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు పీఆర్వో రాజేశ్ షిండే ఒక ప్రకటన విడుదల చేసింది. గురువారం నాటి జాల్నా-ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు(నంబరు 20705), బల్లార్ష-ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నందిగ్రాం ఎక్స్‌ప్రెస్ రైలు(నెంబరు 11002) రద్దు చేశామన్నారు. ఆదిలాబాద్ ప్రయాణికులు గమనించాలని సూచించారు.
News August 20, 2025
ADB: వైన్స్ షాప్ చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్

ఆదిలాబాద్ పట్టణం తిర్పల్లిలోని శ్రీనివాస వైన్స్‌లో గోడకు రంధ్రం చేసి చోరీకి యత్నించిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. వడ్డెర కాలనీకి చెందిన బిలాల్, చిలుకూరి లక్ష్మీనగర్‌కు చెందిన షారుక్‌తోపాటు మరో ముగ్గురు చోరీకి యత్నించారన్నారు. బుధవారం పంజాబ్ చౌక్‌లో అనుమానస్పదంగా తిరుగుతున్న బిలాల్, షారుక్‌లను అరెస్టు చేశామని, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని చెప్పారు.