News March 17, 2024
ఆదిలాబాద్: DEGREE పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ విడుదల
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెగ్యులర్ డిగ్రీకి సంబంధించిన 2, 4, 6 సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీ విడుదల చేసినట్లు KU అధికారులు తెలిపారు. మార్చి 30 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. అలాగే ఏప్రిల్ 10 వరకు ఫైన్‌తో ఫీజు చెల్లించవచ్చన్నారు. పరీక్షలు మేలో ఉంటాయని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ విద్యార్థులు గమనించాలని కోరారు. SHARE IT
Similar News
News October 8, 2024
ADB, ASF, MNCL జిల్లాలను ఆ జాబితాలో చేర్చండి: CM రేవంత్
ఢిల్లీలో జరిగిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎం సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం.. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. వామపక్ష, తీవ్రవాద ప్రభావిత (ఎల్‌డబ్ల్యూఈ) జిల్లాల జాబితాలో నుంచి తొలగించిన ఆదిలాబాద్, మంచిర్యాల,ఆసిఫాబాద్ జిల్లాలను తిరిగి ఆ జాబితాలో చేర్చాలని అమిత్ షా ను రేవంత్ రెడ్డి కోరారు.
News October 8, 2024
తాండూర్: స్నేహితులతో క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి
క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన తాండూర్ మండలంలో చోటు చేసుకుంది. విద్యాభారతి పాఠశాలలో విద్యాభారతి బలగం పేరిట పూర్వ విద్యార్థులు క్రికెట్ ఆడుతున్నారు. ఇందులో భాగంగా రాచకొండ లక్ష్మీనారాయణ క్రికెట్ ఆడుతూ అస్వస్థతకు గురికావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అప్పటి వరకు తమతో ఉత్సాహంగా క్రికెట్ ఆడిన మిత్రుడి మరణంతో తోటి స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.
News October 8, 2024
ఆదిలాబాద్: గ్రామాల్లో అప్పుడే మొదలైన ఎన్నికల హడావుడి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. సర్పంచ్‌గా పోటీ చేయడానికి ఆశావహులు అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఆయా గ్రామాలలో పాత వారితో పాటు కొత్తగా బరిలో నిలవడానికి నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీలు ఈ విధంగా ఉన్నాయి. ఆదిలాబాద్‌లో 468, మంచిర్యాల 311, నిర్మల్ 396, ఆసిఫాబాద్‌లో 355 పంచాయతీలు ఉన్నాయి.