News January 5, 2025

డియర్ పవన్ కళ్యాణ్ గారూ.. థాంక్యూ: చెర్రీ

image

‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన పవన్ కళ్యాణ్‌కు రామ్‌చరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘డియర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.. మీ అబ్బాయిగా, నటుడిగా, గర్వించదగ్గ భారతీయుడిగా మీకు ఎనలేని గౌరవం ఇస్తాను. నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన మీకు థాంక్యూ’ అని ఈవెంట్‌లో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను Xలో షేర్ చేశారు. కాగా ఈవెంట్‌లో మాట్లాడుతూ చెర్రీ తనకు తమ్ముడిలాంటి వారని పవన్ చెప్పారు.

Similar News

News January 8, 2025

ఎల్లుండి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

image

TG: పెండింగ్ బకాయిలు చెల్లించకుంటే ఈనెల 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి ప్రైవేటు ఆసుపత్రులు తేల్చి చెప్పాయి. ఏడాదిగా ఆరోగ్యశ్రీ, EHS, JHS కింద రూ.1000Cr పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నాయి. దీంతో ఆసుపత్రులు నడిపే పరిస్థితులు లేకుండాపోయాయని వెల్లడించాయి. కాగా ఏడాదిలో రూ.920Cr బిల్లులు చెల్లించామని, మరో రూ.450-500 కోట్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

News January 8, 2025

చనిపోయిన జవాన్లలో ఐదుగురు మాజీ మావోలు

image

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో సోమవారం మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో 8 మంది జవాన్లు చనిపోయిన <<15079768>>విషయం<<>> తెలిసిందే. అయితే వీరిలో ఐదుగురు మాజీ మావోయిస్టులని పోలీసులు తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసిన మావోలను డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌లుగా పోలీసు శాఖ నియమించుకుంటుంది. అలా చేరిన బయన్ సోధీ, పండరురామ్ పొయం, డుమ్మా మార్కం, బుద్రామ్ కొర్పా, సోమడు వెట్టి ఈ ఘటనలో చనిపోయారు.

News January 8, 2025

‘పుష్ప-2’ తొక్కిసలాట.. శ్రీతేజ్ హెల్త్ బులెటిన్

image

పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడుతోందని కిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఆపేశామని, వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగిస్తున్నట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అటు నిన్న ఉదయం శ్రీతేజ్‌ను హీరో అల్లు అర్జున్ పరామర్శించిన విషయం తెలిసిందే. గత నెల 4న జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ గాయపడగా అతడి తల్లి రేవతి చనిపోయారు.