News January 5, 2025
డియర్ పవన్ కళ్యాణ్ గారూ.. థాంక్యూ: చెర్రీ
‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన పవన్ కళ్యాణ్‌కు రామ్‌చరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘డియర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.. మీ అబ్బాయిగా, నటుడిగా, గర్వించదగ్గ భారతీయుడిగా మీకు ఎనలేని గౌరవం ఇస్తాను. నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన మీకు థాంక్యూ’ అని ఈవెంట్‌లో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను Xలో షేర్ చేశారు. కాగా ఈవెంట్‌లో మాట్లాడుతూ చెర్రీ తనకు తమ్ముడిలాంటి వారని పవన్ చెప్పారు.
Similar News
News January 25, 2025
కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం చెప్పలేదు: చంద్రబాబు
AP: గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు నష్టమంటూ బీఆర్ఎస్ నేత <<15250698>>హరీశ్ రావు<<>> చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘బనకచర్లకు గోదావరి నీళ్లు తరలిస్తే తెలంగాణకు నష్టం లేదు. వరద జలాలను మాత్రమే తరలిస్తాం. తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం నిర్మిస్తే మేం అభ్యంతరం చెప్పలేదు’ అని వెల్లడించారు. అటు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు.
News January 25, 2025
మహాత్మాగాంధీకి ఇండోనేషియా అధ్యక్షుడి నివాళులు
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఆ దేశంతో భారత దౌత్యబంధం మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి ప్రబోవోను భారత సర్కారు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో భారత్‌కు చేరుకున్న ఆయన, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.
News January 25, 2025
బాలీవుడ్‌లో ఐక్యత లేదు: అక్షయ్ కుమార్
హిందీ చిత్ర పరిశ్రమలో ఐక్యత లోపించిందని నటుడు అక్షయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘నాకే అవకాశం దక్కితే పరిశ్రమలో ఐక్యత తీసుకురావడమే మొదటి లక్ష్యంగా పెట్టుకుంటా. ఒకరి విజయాన్ని మరొకరు సెలబ్రేట్ చేసుకునేలా అందరూ కలిసి పనిచేయాలి. సమస్యలకు ఉమ్మడిగా పరిష్కారాన్ని కనుగొనాలి. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితే ఇతర పరిశ్రమలపైనా అది సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.