News March 17, 2024
చిలకలూరిపేట సభకు మోదీ పర్యటన వివరాలు

మండలంలోని బొప్పూడి వద్ద నేడు జరగనున్న టీడీపీ కూటమి బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సభకు ప్రధానమంత్రి మోదీ హాజరవుతారు. ఆదివారం సాయంత్రం 4. 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 5 నుంచి 6 గంటల వరకు ప్రసంగిస్తారు. 6.10 గంటలకు తిరుగుపయనమవుతారు. 6.55 గంటలకు గన్నవరం చేరుకొని, 7:00 గంటలకు హైదరాబాద్ వెళతారు.
Similar News
News March 20, 2026
GNT: పోలీస్ గ్రీవెన్స్ నిర్వహించిన ఎస్పీ

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సిబ్బంది కోసం గ్రీవెన్స్ జరిగింది. ఎస్పీ వకుల్ జిందాల్ సమస్యలు తెలుసుకొని ఫిర్యాదులను స్వీకరించారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, జరిగిన తప్పులు మరోసారి జరగకుండా చూసుకోవాలని, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. శాఖపరమైన చర్యలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విచారణ అనంతరం విధుల్లోకి తీసుకుంటామని అన్నారు.
News March 20, 2026
GNT: చిన్న శివలింగం వెనుక పెద్ద కథ.. లోకేశ్ వివరణ

పూజ గదిలో ఉన్న బొమ్మలపై వచ్చిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేశ్ Xలో స్పందించారు. నాలుగేళ్ల వయసులో తన కుమారుడు దేవాన్ష్ తయారు చేసిన శివుడి బొమ్మ, చిన్న శివలింగాన్ని జ్ఞాపకంగా పూజా గదిలో ఉంచినట్లు తెలిపారు. చిన్న వయసులోనే శివ భక్తుడిగా ఎదుగుతున్నాడని చెప్పారు. భక్తి అనేది కొందరికి అర్థమవుతుందని, మరికొందరికి కాదని, అలాంటి భక్తికి వివరణ అవసరం లేదని పేర్కొన్నారు.
News March 20, 2026
గుంటూరులో ప్రత్యేక డ్రైవ్.. రూ.5.36 లక్షల జరిమానా

గుంటూరు జిల్లా నందివెలుగు రోడ్డు, కాకాని రోడ్డులో పోలీసులు జాతీయ, రాష్ట్ర రహదారులపై గురువారం సాయంత్రం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. 922 వాహనదారులకు రూ.5.36 లక్షల జరిమానా విధించినట్లు ఎస్పీ వెల్లడించారు. హెల్మెట్, సీటు బెల్ట్, లైసెన్స్, వాహన ధ్రువపత్రాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడం, ప్రజల భద్రత పెంచడం ప్రధాన లక్ష్యం అని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.


