News March 17, 2024

చిలకలూరిపేట సభకు మోదీ పర్యటన వివరాలు

image

మండలంలోని బొప్పూడి వద్ద నేడు జరగనున్న టీడీపీ కూటమి బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సభకు ప్రధానమంత్రి మోదీ హాజరవుతారు. ఆదివారం సాయంత్రం 4. 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 5 నుంచి 6 గంటల వరకు ప్రసంగిస్తారు. 6.10 గంటలకు తిరుగుపయనమవుతారు. 6.55 గంటలకు గన్నవరం చేరుకొని, 7:00 గంటలకు హైదరాబాద్ వెళతారు.

Similar News

News July 8, 2025

GNT: ‘మాజీ ఎంపీ అనుచరుడి నుంచి ప్రాణరక్షణ కల్పించండి’

image

లాలాపేటకు చెందిన ముజబుర్ రహమాన్, తన సోదరుడికి ప్రాణరక్షణ కల్పించాలని కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరుడు సన్నీ, ఇసుక క్వారీ నిర్వహణకు రూ.25 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా బీహార్ గ్యాంగ్‌తో చంపిస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయమై తన సోదరుడు గతంలో ఆత్మహత్యాయత్నం చేశారని పేర్కొన్నారు.

News July 8, 2025

గుంటూరులో కూరగాయల ధరలు రెట్టింపు

image

గుంటూరు మార్కెట్లలో టమాటా, పచ్చిమిరప, వంకాయ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. పచ్చిమిరప కిలో రూ.80కి చేరగా, టమాటా రూ.40, వంకాయ రూ.60 పలుకుతోంది. ములక్కాయ ఒక్కటి రూ.15 నుంచి రూ.20కి పెరగడం వినియోగదారులను కుదిపేస్తోంది. డిమాండ్‌తో పోల్చితే సరఫరా తక్కువగా ఉండటం వల్లే ఈ ధరల పెరుగుదల అని వ్యాపారులు తెలిపారు. రైతుబజార్లలో కూడా ఇదే స్థితి కొనసాగుతోంది.

News July 8, 2025

GNT: ఆన్లైన్ ట్రేడింగ్ మాయలో భారీ నష్టం.. ఎస్పీకి ఫిర్యాదు

image

పొన్నూరు ఇటికంపాడు రోడ్డుకు చెందిన మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయుడు ఆన్లైన్ ట్రేడింగ్ మోసానికి గురయ్యారు. ఓ యాప్ డౌన్లోడ్ చేసి ట్రేడింగ్ ప్రారంభించగా, కాల్స్ ద్వారా ఆకర్షితుడై రూ.27 లక్షలు మోసపోయారు. మొదట లాభాలంటూ ఆశ చూపి తర్వాత మొత్తం కట్టించారని, తర్వాత ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదని సోమవారం ఆయన ఎస్సీకి ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.