News March 17, 2024
ప.గో.: నేతలకు పరీక్ష.. పాస్ అయ్యేదెవరు..?

ఎన్నికల్లో బరిలో నిలిచే నాయకుల జీవితాన్ని జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థితో పోలిస్తే..ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు (జాబ్ నోటిఫికేషన్). నిన్నటి నుంచి 57రోజుల పాటు ప్రిపరేషన్ (ప్రచారానికి) సమయం. మే 13న పరీక్ష(ఓటింగ్). ఆ తర్వాత 22 రోజులకు జూన్ 4న ఫలితాలు. ఉమ్మడి ప.గో. జిల్లాలో 15 స్థానాలకు(పోస్టులకు) ఎంతమంది పరీక్ష రాస్తారన్నది తేలాలి. ఏప్రిల్ 25 వరకు పరీక్షకు అప్లై (నామినేషన్) చేసుకోనున్నారు.
Similar News
News November 3, 2025
భీమవరం: నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) యథావిధిగా జరుగుతుందని ఆమె చెప్పారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పీజీఆర్‌ఎస్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News November 2, 2025
ఉండి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఉండి మండలం నక్కరాజగుంట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉండి నుంచి ఆకివీడు వెళుతున్న గంధం రాఘవులు అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News November 2, 2025
బియ్యం బస్తా మోసిన ఎమ్మెల్యే నాయకర్

తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన వేములదీవిలో శనివారం నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ క్రమంలో 50 కేజీల బియ్యం బస్తా, ఇతర సరుకులను ఇంటికి తీసుకెళ్లలేక ఇబ్బంది పడుతున్న ఒక దివ్యాంగురాలిని ఎమ్మెల్యే నాయకర్ గమనించారు. వెంటనే ఆయనే స్వయంగా బియ్యం బస్తాతో సహా సరుకులన్నింటినీ తన భుజాలపై మోసుకుని, ఆమె త్రిచక్ర వాహనం వరకూ చేర్చారు. ఆపదలో ఉన్న బాధితురాలికి ఎమ్మెల్యే చేసిన సాయం ఆదర్శంగా నిలిచింది.


