News March 17, 2024

ప.గో.: నేతలకు పరీక్ష.. పాస్ అయ్యేదెవరు..?

image

ఎన్నికల్లో బరిలో నిలిచే నాయకుల జీవితాన్ని జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థితో పోలిస్తే..ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు (జాబ్ నోటిఫికేషన్). నిన్నటి నుంచి 57రోజుల పాటు ప్రిపరేషన్‌ (ప్రచారానికి) సమయం. మే 13న పరీక్ష(ఓటింగ్). ఆ తర్వాత 22 రోజులకు జూన్ 4న ఫలితాలు. ఉమ్మడి ప.గో. జిల్లాలో 15 స్థానాలకు(పోస్టులకు) ఎంతమంది పరీక్ష రాస్తారన్నది తేలాలి. ఏప్రిల్ 25 వరకు పరీక్షకు అప్లై (నామినేషన్) చేసుకోనున్నారు.

Similar News

News December 12, 2024

వైసీపీకి భీమవరం మాజీ MLA రాజీనామా?

image

ప.గో జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలినట్లు సమాచారం. భీమవరం మాజీ MLA గ్రంధి శ్రీనివాస్ ఆ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఓటమి నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారు. అయితే ఆయన భవిష్యత్ కార్యాచరణ తెలియాల్సి ఉంది.

News December 12, 2024

ప.గో జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన

image

సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తానని మాజీ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ఆయన పర్యటన ఉభయ గోదావరి జిల్లాలో ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జగన్ గోదావరి జిల్లా పర్యటన చేస్తారని వైసీపీ చింతలపూడి ఇన్‌ఛార్జ్ కంభం విజయరాజు తెలిపారు. సంక్రాంతి తర్వాత జగన్ గోదావరి జిల్లా ప్రజలను కలుస్తారని చెప్పారు.

News December 12, 2024

ఏలూరు జిల్లాలో 354 నీటి సంఘాలు: కలెక్టర్

image

జిల్లా సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గెజిట్ నెం.62 బుధవారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విడుదల చేశారు. జిల్లాలో 354 నీటి వినియోగదారుల సంఘాలు ఉన్నాయని, వీటిలో 23 గోదావరి పడమర, కృష్ణా- తూర్పు నీటి కాలువ 54 సంఘాలు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎడమ 15, తమ్మిలేరు ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ 6 నీటి సంఘాలు, శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువకు 5, మైనర్ ఇరిగేషన్ చెరువులకు 251 సంఘాలు ఉన్నాయన్నారు.