News January 5, 2025
SHOCKING: పెళ్లికాని జంటలకు ఓయోలో నో రూమ్స్
హోటల్ బుకింగ్ సంస్థ ఓయో నూతన చెక్ ఇన్ పాలసీని తీసుకొచ్చింది. దీని ప్రకారం పెళ్లి కాని జంటలు రూమ్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ నిబంధనలను తొలుత UP మీరట్‌లో అమలుచేస్తోంది. ఆ తర్వాత దేశమంతా విస్తరించే అవకాశం ఉంది. ఇకపై రూమ్ బుకింగ్ సమయంలో జంటలు తమ పెళ్లిని నిర్ధారించే IDని సమర్పించాలి. సురక్షితమైన, బాధ్యతాయుతమైన హాస్పిటాలిటీకి తాము కట్టుబడి ఉన్నామని ఓయో నార్త్ ఇండియా హెడ్ పవాస్ శర్మ తెలిపారు.
Similar News
News January 8, 2025
రైళ్లలో వెళ్లేవారు ఈ నంబర్ సేవ్ చేసుకోండి!
పండుగ సందర్భంగా ప్రజలు రైళ్ల ద్వారా సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ట్రైన్లలో వెళ్లేవారు తప్పనిసరిగా ఓ నంబర్ సేవ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 9881193322ను సేవ్ చేసుకొని వాట్సాప్‌లో Hi అని మెసేజ్ చేయాలి. ఇందులో PNR స్టేటస్, ఫుడ్ ఆర్డర్, ట్రైన్ షెడ్యూల్ & కోచ్ పొజిషన్, ముఖ్యంగా ట్రైన్‌లో ఎవరైనా ఇబ్బందిపెడితే రైల్ మదద్ ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు అధికారులు వస్తారు. SHARE IT
News January 8, 2025
వర్రా రవీంద్రారెడ్డిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
AP: YCP సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పులివెందుల పోలీసులు రెండ్రోజుల కస్టడీకి తీసుకున్నారు. కడప జైలు నుంచి రిమ్స్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కడప సైబర్ క్రైమ్ PSకు తీసుకెళ్లి విచారిస్తున్నారు. వర్రా రవీంద్రారెడ్డిపై జిల్లాలో 10, రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులున్నాయి. చంద్రబాబు, లోకేశ్, పవన్, అనితపై ఇతను సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు కేసులు నమోదయ్యాయి.
News January 8, 2025
అభిమానుల కుటుంబాలకు రాంచరణ్ పరిహారం
‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్ నుంచి వెళ్తూ రోడ్డుప్రమాదంలో మరణించిన ఇద్దరి కుటుంబాలకు రాంచరణ్ పరిహారం అందజేశారు. RTGS ద్వారా పేమెంట్ చేయగా, దానికి సంబంధించిన వివరాలను చెర్రీ ఫ్యాన్స్ బాధితుల తల్లిదండ్రులకు అందించారు. కాగా కాకినాడ జిల్లాకు చెందిన చరణ్, మణికంఠ రోడ్డుప్రమాదంలో మరణించారు. వీరికి పవన్, రాంచరణ్, దిల్ రాజు చెరో రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.