News January 5, 2025
SHOCKING: పెళ్లికాని జంటలకు ఓయోలో నో రూమ్స్
హోటల్ బుకింగ్ సంస్థ ఓయో నూతన చెక్ ఇన్ పాలసీని తీసుకొచ్చింది. దీని ప్రకారం పెళ్లి కాని జంటలు రూమ్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ నిబంధనలను తొలుత UP మీరట్‌లో అమలుచేస్తోంది. ఆ తర్వాత దేశమంతా విస్తరించే అవకాశం ఉంది. ఇకపై రూమ్ బుకింగ్ సమయంలో జంటలు తమ పెళ్లిని నిర్ధారించే IDని సమర్పించాలి. సురక్షితమైన, బాధ్యతాయుతమైన హాస్పిటాలిటీకి తాము కట్టుబడి ఉన్నామని ఓయో నార్త్ ఇండియా హెడ్ పవాస్ శర్మ తెలిపారు.
Similar News
News January 16, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 16, గురువారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
✒ ఇష: రాత్రి 7.19 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 16, 2025
కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ట్రంప్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య <<15166636>>కాల్పుల విరమణ<<>> ఒప్పందాన్ని యూఎస్‌కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. మిడిల్ ఈస్ట్‌లో బందీలను విడిపించేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపారు. త్వరలోనే వారు విడుదల అవుతారని ట్రూత్ సోషల్ నెట్‌వర్క్‌లో చెప్పారు. ఈ నెల 20న ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
News January 16, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.