News January 5, 2025
ఏప్రిల్ 1 నుంచి మరో పథకం అమలు: TDP

AP: ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టీడీపీ ట్వీట్ చేసింది. కోటీ 43 లక్షల పేద కుటుంబాలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించే ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలు కానుందని వెల్లడించింది. ప్రతి కుటుంబానికి రూ.2,500 వరకు ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొంది.
Similar News
News December 30, 2025
పోస్టల్ సర్వీసులు అద్భుతం.. నెటిజన్ సంతోషం

ఆధార్ అప్‌డేట్ విషయంలో పోస్టల్ సేవలపై ఓ నెటిజన్ ప్రశంసలు కురిపించారు. ఐదేళ్లు నిండిన తన బిడ్డ ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం 4 నెలలుగా స్లాట్ బుకింగ్‌కు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వెల్లడించారు. ఎక్కడ చూసినా స్లాట్లు లేవని.. చివరకు సమీపంలోని పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లగా కేవలం 30 నిమిషాల్లోనే పని పూర్తైందని ఆనందం వ్యక్తం చేశాడు. కొన్నిసార్లు తక్కువ అంచనా వేసిన వ్యవస్థలే ఉత్తమంగా పనిచేస్తాయన్నారు.
News December 30, 2025
నువ్వుల పంటపై పేనుబంక ప్రభావం – నివారణ

నువ్వుల పంట వేసిన 25 రోజుల నుంచి పంటలో ఈ పురుగు ఆశించడం జరుగుతుంది. పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు పాలిపోయి తర్వాత ఎండిపోతాయి. వాటి ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల నుంచి తేనె లాంటి జిగురు పదార్థం విడుదలై మొక్క చుట్టుపక్కల చీమలు చేరతాయి. ఈ పురుగు నివారణకు ఇమిడాక్లోఫ్రిడ్ 0.3ml లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 30, 2025
2025: క్రీడల్లో మన సివంగులదే డామినేషన్

ఈ ఏడాది క్రీడల్లో భారత మహిళలు సత్తా చాటారు. వన్డే WC, తొలి అంధుల మహిళా టీ20 ప్రపంచకప్ మన ఆడబిడ్డలే గెలుచుకున్నారు. కబడ్డీ WCను దక్కించుకున్నారు. ఇక ఫిడే ఉమెన్స్ గ్రాండ్ స్విస్ 2025 ఛాంపియన్‌గా వైశాలి నిలిచారు. హాకీ ఆసియా కప్, అథ్లెటిక్స్, వరల్డ్ బాక్సింగ్ కప్‌లోనూ భారత నారీమణులు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. రెట్టించిన ఉత్సాహంతో వచ్చే ఏడాదికి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించారు.


