News January 5, 2025

ఏప్రిల్ 1 నుంచి మరో పథకం అమలు: TDP

image

AP: ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టీడీపీ ట్వీట్ చేసింది. కోటీ 43 లక్షల పేద కుటుంబాలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించే ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమలు కానుందని వెల్లడించింది. ప్రతి కుటుంబానికి రూ.2,500 వరకు ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొంది.

Similar News

News January 18, 2025

సెమీ ఫైనల్స్‌లో సాత్విక్-చిరాగ్ శెట్టి ఓటమి

image

ఇండియా ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో మెన్స్ డబుల్స్ జంట సాత్విక్-చిరాగ్ శెట్టి పోరాటం ముగిసింది. సెమీ ఫైనల్స్‌లో మలేషియా జోడీ గోహ్ స్జెఫీ-నూర్ ఇజ్జుద్దీన్‌ 21-18, 21-14 తేడాతో గెలిచింది. కేవలం 37 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. ఇప్పటికే పీవీ సింధు కూడా ఓడిపోయిన విషయం తెలిసిందే. క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియా ప్లేయర్ గ్రెగోరియా 21-9, 19-21, 21-17 తేడాతో గెలిచారు.

News January 18, 2025

అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ

image

AP: రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఘన స్వాగతం పలికారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంపై కృతజ్ఞతలు తెలిపారు. పలు అంశాలపై చర్చించిన అనంతరం డిన్నర్ చేశారు.

News January 18, 2025

జియో రీఛార్జ్ ప్లాన్.. రూ.49కే..

image

ప్రముఖ టెలికం కంపెనీ జియో రూ.49కే అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 24 గంటలు. ఒకరోజు అపరిమిత డేటా కావాలనుకునేవారికి ఈ రీఛార్జ్ ప్లాన్ మంచి ఆప్షన్. కానీ ఇందులో కాలింగ్, SMS సౌకర్యం పొందలేరు. రూ.11కే గంటపాటు అన్‌లిమిటెడ్ డేటా రీఛార్జ్ ప్లాన్‌ను కూడా Jio తీసుకొచ్చింది. ఇప్పటికే జియో నుంచి తీవ్రపోటీ ఎదుర్కొంటున్న Airtel, VI, BSNLకి ఈ కొత్త ప్లాన్లు మరింత సవాలుగా మారే అవకాశాలున్నాయి.