News January 5, 2025
ALERT: మాస్క్ పెట్టుకోవడం లేదా?

చైనాలో HMPV వైరస్ విజృంభణతో మనదేశంలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే జలుబు, దగ్గు ఉన్నవారు మాస్కులు పెట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ప్రతిఒక్కరూ ఇంటి నుంచి బయటికి వెళ్తే తప్పకుండా మాస్క్ పెట్టుకోవడం ఉత్తమం. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఉండేవారికి తప్పనిసరి. HMPV వైరస్ వ్యాప్తి ఇంకా మనదగ్గర లేకపోయినా చలికాలం కావడంతో రకరకాల ఫ్లూలు, వైరస్‌లు ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంది. SHARE
Similar News
News November 7, 2025
బ్రిటిష్ పాలన చట్టాలతో ఆస్తి కొనుగోళ్లలో కష్టాలు: SC

దేశంలో ప్రాపర్టీ కొనుగోళ్లు బాధలతో కూడుకున్నవిగా మారాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘1882 నాటి చట్టాలతోనే ఇప్పటి ‘రియల్’ వ్యవహారాలు నడుస్తున్నాయి. నాటి యాక్ట్ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేస్తుంది తప్ప టైటిల్ కాదు. రిజిస్టర్డ్ సేల్‌డీడ్ లావాదేవీ విలువ రికార్డు మాత్రమే. అది యాజమాన్య హక్కు ఇవ్వదు’ అని పేర్కొంది. చట్టాలను సవరించి నేటి టెక్నాలజీతో రిజిస్ట్రేషన్లను ఆధునికీకరించాలని సూచించింది.
News November 7, 2025
HDFC బ్యాంక్ యూజర్లకు BIG ALERT

ఈ రాత్రి 2.30 గంటల(8వ తేదీ) నుంచి ఉ.6.30 గంటల వరకు తమ బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండవని HDFC ప్రకటించింది. మెయింటెనెన్స్‌లో భాగంగా UPI, నెట్ బ్యాకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంది. ఈమేరకు ఖాతాదారులకు మెసేజ్‌లు పంపుతోంది. ఆ సమయంలో ట్రాన్సాక్షన్స్ కోసం PayZapp వ్యాలెట్ వాడాలని సూచించింది. మరి మీకూ ఈ మెసేజ్ వచ్చిందా?
News November 7, 2025
సిరీస్‌పై భారత్ కన్ను!

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో 2-1తో లీడ్‌లో ఉన్న భారత్ రేపు జరిగే చివరి(5వ) మ్యాచులోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోగా ఇదైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. అయితే మ్యాచ్ జరిగే గబ్బా(బ్రిస్బేన్) గ్రౌండ్‌లో ఆసీస్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 2006 నుంచి ఇక్కడ ఆ జట్టు 8 టీ20లు ఆడగా కేవలం ఒక్కదాంట్లోనే ఓడింది. దీంతో ఆసీస్‌ను ఇండియా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.


