News January 5, 2025

ALERT: మాస్క్‌ పెట్టుకోవడం లేదా?

image

చైనాలో HMPV వైరస్ విజృంభణతో మనదేశంలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే జలుబు, దగ్గు ఉన్నవారు మాస్కులు పెట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ప్రతిఒక్కరూ ఇంటి నుంచి బయటికి వెళ్తే తప్పకుండా మాస్క్ పెట్టుకోవడం ఉత్తమం. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఉండేవారికి తప్పనిసరి. HMPV వైరస్ వ్యాప్తి ఇంకా మనదగ్గర లేకపోయినా చలికాలం కావడంతో రకరకాల ఫ్లూలు, వైరస్‌లు ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంది. SHARE

Similar News

News January 20, 2025

ALERT.. రేపు, ఎల్లుండి జాగ్రత్త

image

TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. రానున్న రెండ్రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం పూట పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

News January 20, 2025

కొత్త పథకాలకు లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లోనే: భట్టి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లోనే ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు. అర్హులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా సాయం అందిస్తామని వెల్లడించారు. భూమి లేని నిరుపేదలకు ఖాతాల్లో ఏటా రూ.12వేలు జమచేస్తామని పేర్కొన్నారు.

News January 20, 2025

ఈ నెల 28 నుంచి నాగోబా జాతర

image

TG: రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన ఆదివాసుల పండగ నాగోబా జాతర ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో జరిగే ఈ జాతరకు వేదపండితులు, దేవదాయశాఖ అధికారులు మంత్రి కొండా సురేఖను కలిసి ఆహ్వానం పలికారు. ఈ జాతరకు ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఆదివాసులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు.