News January 6, 2025

రేసింగ్ కేసు.. ఇవాళ విచారణకు కేటీఆర్!

image

TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి KTR ఇవాళ ఉ.10.30 గం.లకు ACB ఎదుట హాజరుకానున్నారు. UKకు చెందిన రేసింగ్ నిర్వహణ సంస్థకు రూ.45.71కోట్లు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించినట్లు ఆయనపై అభియోగాలున్నాయి. దీనిపై విచారణ చేపట్టిన ACB విచారణకు రావాలంటూ ఈనెల 3న కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఇదే కేసుపై దర్యాప్తు జరుపుతున్న ఈడీ ఈనెల 7న(రేపు) తమ ఎదుట హాజరుకావాలని ఆయనకు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.

Similar News

News January 8, 2025

చంద్రబాబు వస్తున్నారు.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ట్వీట్

image

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 20 నుంచి నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్-2025 వార్షిక సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ విషయాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ X వేదికగా ప్రకటించింది. 2024లో 125 దేశాల ప్రతినిధులు ఫోరమ్‌కు హాజరవగా ఈ ఏడాది కూడా G7 &G20 దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ప్రపంచ ప్రజాప్రతినిధులు రానున్నారు.

News January 8, 2025

రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

image

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ 38 ఏళ్ల ప్లేయర్ కెరీర్‌లో 198 వన్డేలు, 122 T20లు, 47 టెస్టులు ఆడారు. 3 ఫార్మాట్లలో కలిపి 13,463 రన్స్ చేశారు. అందులో 23 సెంచరీలు ఉన్నాయి. 2022 సెప్టెంబర్‌లో చివరి వన్డే ఆడారు. వన్డేల్లో కివీస్ తరఫున డబుల్ సెంచరీ చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచారు.

News January 8, 2025

మే 1న సూర్య ‘రెట్రో’ విడుదల

image

తమిళ స్టార్ నటుడు సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తోన్న రొమాంటిక్ డ్రామా ‘రెట్రో’ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది మే 1వ తేదీన విడుదల చేస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా సంతోశ్ నారాయణ్ మ్యూజిక్ అందించారు. సూర్య నటించిన ‘కంగువా’ ఇటీవలే విడుదలవగా ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది.