News January 6, 2025
నమస్కారం ముద్దు.. హ్యాండ్ షేక్ వద్దు: IMA
చలితో ప్రబలే సీజనల్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని IMA హైదరాబాద్ విభాగం సూచించింది. ప్రస్తుతం నగరంలో శ్వాస సంబంధ కేసులు అదుపులోనే ఉన్నాయని తెలిపింది. అయినప్పటికీ పిల్లలు సహా అందరూ తప్పక ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని IMA HYD అధ్యక్షుడు డా. ప్రభు సూచించారు. hMPV కేసుల నేపథ్యంలో ఇతరులను తాకడాన్ని మానుకోవాలన్నారు. అటు పలకరింపులో ‘నమస్కారం ముద్దు హ్యాండ్ షేక్ వద్దు’ను పాటించాలని సూచించారు.
Similar News
News January 9, 2025
తీవ్ర ఆవేదనకు లోనయ్యా: పవన్ కళ్యాణ్
AP: తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనైనట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తగిన సమాచారం ఇచ్చి, సహాయ సహకారాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఘటన నేపథ్యంలో తిరుపతిలోని టికెట్ కౌంటర్ల వద్ద అధికారులు, పోలీసులకు జనసైనికులు తోడ్పాటు అందించాలని పవన్ సూచించారు.
News January 9, 2025
కొందరు అధికారుల వల్లే ఈ ఘటన: చంద్రబాబు
AP: తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రేపు ఉదయం సీఎం చంద్రబాబు తిరుపతిలో పర్యటించనున్నారు. కొందరు అధికారుల వల్లే ఈ ఘటన జరిగిందని అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో వారిపై అసంతృప్తితో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.
News January 9, 2025
రద్దీ కారణంగానే ముందుగా టోకెన్లు జారీ: TTD ఈవో
AP: రేపు ఉ.5 గంటలకు జారీ చేయాల్సిన టోకెన్లను భక్తుల రద్దీ కారణంగా ముందుగానే ప్రారంభించినట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. మరోవైపు ఎలాంటి బందోబస్తు లేకపోవడమే ఘటనకు కారణమని భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. వాస్తవానికి రేపు ఉ.5 గంటలకు ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను భక్తులకు ఇవ్వాలని నిర్ణయించారు.