News January 6, 2025

నమస్కారం ముద్దు.. హ్యాండ్ షేక్ వద్దు: IMA

image

చలితో ప్రబలే సీజనల్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని IMA హైదరాబాద్ విభాగం సూచించింది. ప్రస్తుతం నగరంలో శ్వాస సంబంధ కేసులు అదుపులోనే ఉన్నాయని తెలిపింది. అయినప్పటికీ పిల్లలు సహా అందరూ తప్పక ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని IMA HYD అధ్యక్షుడు డా. ప్రభు సూచించారు. hMPV కేసుల నేపథ్యంలో ఇతరులను తాకడాన్ని మానుకోవాలన్నారు. అటు పలకరింపులో ‘నమస్కారం ముద్దు హ్యాండ్ షేక్ వద్దు’ను పాటించాలని సూచించారు.

Similar News

News January 16, 2025

రేపు ఓటీటీలోకి విడుదల-2?

image

వెట్రిమారన్ డైరెక్షన్‌లో విజయ్ సేతుపతి, సూరి, మంజూ వారియర్ ప్రధానపాత్రల్లో నటించిన విడుదల-2 రేపు ఓటీటీలోకి రానున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంటున్నాయి. ఓటీటీలో 3 గంటల 44 నిమిషాల నిడివితో మూవీ ఉంటుందని తెలుస్తోంది. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోయినా వెట్రిమారన్ టేకింగ్, సేతుపతి నటన హైలైట్‌గా నిలిచాయి.

News January 16, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.10వేల కోట్ల ప్యాకేజీ?

image

నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను గట్టెక్కించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికి ఫైనాన్షియల్ ప్యాకేజీ కింద రూ.10వేల కోట్లు ప్రకటించనున్నట్లు సమాచారం. దీనిపై ఇవాళ జరిగిన కేంద్ర క్యాబినెట్‌లో చర్చించిందని జాతీయ మీడియా పేర్కొంది. ఆర్థిక ప్యాకేజీపై రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

News January 16, 2025

మన స్టార్ క్రికెటర్లు చివరిగా రంజీలు ఎప్పుడు ఆడారంటే?

image

జూనియర్, సీనియర్ తేడా లేకుండా క్రికెటర్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని BCCI స్పష్టం చేసింది. దీంతో కొందరు రంజీలకు సిద్ధమవగా, మరికొందరు ఇంకా స్పందించలేదు. ఈ క్రమంలో మన స్టార్ క్రికెటర్లు చివరిసారిగా రంజీ మ్యాచ్‌లు ఎప్పుడు ఆడారో తెలుసుకుందాం. కోహ్లీ(DEL)-2012, రోహిత్(MUM)-2015, బుమ్రా(GUJ)-2017, పంత్(DEL)-2018, రాహుల్(KAR)-2020, జడేజా(SAU)-2023.