News January 6, 2025

11 నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

image

AP: నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఈ నెల 11 నుంచి 17 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. తొలి రోజు ఉదయం స్వామివారి యాగశాల ప్రవేశ కార్యక్రమంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. 12న భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి వాహనసేవలు, 14న కల్యాణం, 16న యాగ పూర్ణాహుతి, త్రిశూలస్నానం, ధ్వజారోహణం తదితర కార్యక్రమాలు ఉంటాయి. చివరి రోజైన 17న పుష్పోత్సవం నిర్వహిస్తారు.

Similar News

News July 4, 2025

రాష్ట్రంలో 3 దాడులు.. 6 కేసులు: అంబటి

image

AP: రాష్ట్రంలో పరిస్థితి మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరిగా తయారైందని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. రోజూ ఎక్కడో ఓ చోట YCP కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. ‘రెడ్ బుక్ కోసం కొందరు అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లు కలిసి పని చేస్తున్నారు. పోలీసులు ఈ దాడులను ఆపటం లేదు. ఎవరు చంపుకున్నా YCP నేతలపైనే కేసులు పెడుతున్నారు. కూటమి సర్కార్ తాటాకు చప్పుళ్లకు తాము భయపడం’ అని స్పష్టం చేశారు.

News July 4, 2025

నటి రన్యా రావుకు చెందిన రూ.34 కోట్ల ఆస్తులు అటాచ్

image

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా రావుకు సంబంధించిన రూ.34 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రన్యా రావును బంగారం అక్రమ రవాణా, హవాలా నగదు బదిలీల కేసులో DRI అధికారులు ఈ ఏడాది మార్చి 5న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో బంగారం కొని భారత్‌కు తరలిస్తుండగా బెంగళూరులో అధికారులు పట్టుకున్నారు. అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉన్నారు.

News July 4, 2025

సెప్టెంబర్‌లో స్కిల్ పోర్టల్ ప్రారంభం: మంత్రి లోకేశ్

image

AP: స్కిల్ పోర్టల్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించారు. ‘ఉద్యోగ, ఉపాధి కల్పనకు మిషన్ మోడ్ విధానంలో స్కిల్ పోర్టల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తాం. 90 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఆటోమేటిక్‌గా రెజ్యూమ్ రెడీ అవుతుంది’ అని Xలో పోస్ట్ చేశారు.