News March 17, 2024
బొబ్బిలిలో రైలు ఢీకొని మృతి

బొబ్బిలి ఇందిరమ్మకాలనీ సమీపంలో రైలు ఢీకొని వృద్దుడు తామాడ అప్పలస్వామి(68) మృతి చెందినట్లు రైల్వే హెచ్‌సి బి.ఈస్వరరావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. బాడంగి మండలం అనవరం గ్రామానికి చెందిన అప్పలస్వామి గొల్లపల్లి పెళ్లికి వెళ్లాడు. తిరిగు ప్రయాణంలో ఇందిరమ్మకాలనీ వద్ద రైల్వే పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని ట్రైన్ ఢీకొని మృతి చెందారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News March 20, 2026
గ్యాస్ పొదుపుగా వాడుకోవాలి: VZM కలెక్టర్

జిల్లాలో గృహ వినియోగ గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని, డిమాండ్‌కు సరిపడా సరఫరా జరుగుతోందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు శుక్రవారం నిర్వహించిన VC అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. అవసరానికి మించి గ్యాస్ బుకింగ్ చేయకుండా, పొదుపుగా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్-సప్లై అంతరాన్ని తగ్గించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను అదేశించారు.
News March 20, 2026
గోదావరిలో విజయనగరం విద్యార్థి గల్లంతు

ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరి నదిలో <<19432323>>గల్లంతైన<<>> ఐదుగురు యువకులు అమరావతిలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. సతీశ్(మదనపల్లి), నవదీప్ (ఉయ్యూరు), తేజజ్ఞ(ఉయ్యూరు), శ్రీకర్(భద్రాచలం), అభిరామ్(విజయనగరం) అని తేల్చారు. వీరంతా బీటెక్ సెకండియర్ చదువుకుంటున్నారన్నారు. ఏడుగురు గోదావరిలో దిగగా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారన్నారు.
News March 20, 2026
విజయనగరంలో ఈనెల 24న మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు

విజ్జి స్టేడియంలో ఈనెల 24న ఉదయం 8 గంటలకు మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వర రావు శుక్రవారం తెలిపారు. 35 ఏళ్లు, 45 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నామన్నారు. ఆసక్తి గలవారు SAAP వెబ్‌సైట్‌లో ఆధార్‌తో రిజిస్టర్ కావాలని, అవసరమైన పత్రాలు సమర్పించాలని సూచించారు.


