News January 7, 2025
వాలంటీర్లు వద్దే వద్దు: నిరుద్యోగ జేఏసీ
AP: వాలంటీర్లను అడ్డం పెట్టుకొని వైసీపీ కార్యక్రమాలు నిర్వహించిందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ అన్నారు. ఆ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టొద్దని ఆయన డిమాండ్ చేశారు. YCP హయాంలో వాలంటీర్లకు చెల్లించిన రూ.700కోట్లను మాజీ CM జగన్ నుంచి రాబట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వారికి డబ్బులిచ్చి ప్రజాధనం వృథా చేస్తున్నట్లు గతంలోనే హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు సిద్ధిక్ గుర్తుచేశారు.
Similar News
News January 9, 2025
ఇచ్ఛాపురంలో స్వల్ప భూ ప్రకంపనలు
AP: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. బుధవారం రాత్రి 10:56 గంటలకు 2 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. అలాగే గురువారం తెల్లవారుజామున 4:55 గంటల సమయంలో మరోసారి స్వల్పంగా భూమి కంపించిందని తెలిపారు. దీంతో ఇచ్ఛాపురం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం అక్టోబరులోనూ ఇలాగే భూ ప్రకంపనలు వచ్చాయని చెబుతున్నారు.
News January 9, 2025
ప్రముఖ నిర్మాత కన్నుమూత
ప్రముఖ రచయిత, నిర్మాత ప్రితీశ్ నంది(73) కన్నుమూశారు. తానొక మంచి స్నేహితుడిని కోల్పోయానంటూ ఈ విషయాన్ని నటుడు అనుపమ్ ఖేర్ ఇన్‌స్టా ద్వారా తెలిపారు. ప్రితీశ్ తన నిర్మాణ సంస్థ ద్వారా ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, మీరాబాయ్ నాటౌట్, అగ్లీ ఔర్ పాగ్లీ, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ వంటి చిత్రాలు నిర్మించారు. జర్నలిస్టుగానూ సుపరిచితుడైన ప్రితీశ్ TOI తదితర సంస్థల్లో పనిచేశారు. గతంలో ఆయన రాజ్యసభ ఎంపీగానూ వ్యవహరించారు.
News January 9, 2025
సీఎంను విమర్శిస్తే కౌంటర్ ఇవ్వరా..? మంత్రులకు కేసీ క్లాస్
TG: PAC సమావేశంలో మంత్రులకు AICC ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. CMను ప్రతిపక్షాలు విమర్శిస్తే ఆయనే కౌంటర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని, మంత్రులెందుకు స్పందించడంలేదని నిలదీశారని తెలుస్తోంది. తాను స్పందిస్తున్నానని ఓ మంత్రి చెప్పగా, ఎవరేం చేస్తున్నారో తనకంతా తెలుసని అన్నారు. కొందరు మంత్రులు పార్టీ లైన్ దాటి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహించినట్లు సమాచారం.