News January 7, 2025
ఈనెల 10న బీజేపీ నిరసనలు
TG: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్‌తో ఈనెల 10న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు BJP ప్రకటించింది. ఆరోజున కలెక్టర్లు, తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇస్తామని తెలిపింది. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా రైతు భరోసా అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. పాలనకు బీసీలు పనికి రారని CM రేవంత్ గతంలో వ్యాఖ్యానించారని మండిపడ్డారు.
Similar News
News January 9, 2025
బ్రేక్‌ఫాస్ట్ ఏ సమయంలో తింటున్నారు?
కొందరు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి బద్ధకిస్తుంటారు. కానీ ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 7 నుంచి 8 గంటల సమయంలో అల్పాహారం తీసుకోవాలి. ఉదయం 9 గంటల తర్వాత తినకూడదు. ఇలా చేస్తే డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఆలస్యంగా టిఫిన్ చేస్తే గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఉంది. జీవక్రియకు కూడా ఆటంకం కలుగుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌కు, లంచ్‌కు కనీసం 4 గంటల గ్యాప్ ఉండాలి.
News January 9, 2025
హనీరోజ్‌ను వేధించిన బిజినెస్‌మ్యాన్ అరెస్ట్
హీరోయిన్ హనీరోజ్‌ను <<15073430>>వేధించిన<<>> ప్రముఖ బిజినెస్‌మ్యాన్ బాబీ చెమ్మనూర్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వయనాడ్‌లో ఆయనను అదుపులోకి తీసుకుని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాబీ గతంలో హనీరోజ్‌ను కొన్ని ఈవెంట్లకు ఆహ్వానించారు. కానీ ఆమె వాటికి హాజరుకాకపోవడంతో సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్టులు పెట్టారు. దీనిపై హనీ రోజ్ ఎర్నాకుళం పీఎస్‌లో ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేశారు.
News January 9, 2025
ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉంటాయి: ప్రభుత్వం
AP: ఇంటర్ <<15096013>>ఫస్టియర్ పరీక్షల<<>> రద్దుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఫస్టియర్ పరీక్షలు కాలేజీలు నిర్వహించి, సెకండియర్ ఎగ్జామ్స్ బోర్డు నిర్వహించాలన్నది ప్రతిపాదనే అని తెలిపింది. జనవరి 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తీసుకుంటామని, ఆ తర్వాత తుది నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది.