News January 7, 2025

ఈనెల 10న బీజేపీ నిరసనలు

image

TG: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్‌తో ఈనెల 10న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు BJP ప్రకటించింది. ఆరోజున కలెక్టర్లు, తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇస్తామని తెలిపింది. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా రైతు భరోసా అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. పాలనకు బీసీలు పనికి రారని CM రేవంత్ గతంలో వ్యాఖ్యానించారని మండిపడ్డారు.

Similar News

News March 9, 2026

ఆ తేదీల్లో రికమండేషన్ లెటర్లు అంగీకరించం: TTD

image

AP: తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం సందర్భంగా ఈ నెల 17, 19 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు TTD తెలిపింది. ఈ క్రమంలో 16, 18 తేదీల్లో ఎంపీ, ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్లు అంగీకరించబోమని పేర్కొంది. అయితే వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పింది.

News March 9, 2026

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్?.. మస్క్ రియాక్షన్ ఇదే

image

సూరత్‌(గుజరాత్‌)లో షాకింగ్ ఘటన జరిగింది. ‘ఎలా చనిపోవాలి? ఏ మందులు వాడాలి?’ అని ChatGPTలో అడిగి ఇద్దరు అమ్మాయిలు(18, 20ఏళ్లు) సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి Xలో పోస్టు చేయగా ఎలాన్ మస్క్ yikes(ప్రమాదకరం, షాకింగ్) అంటూ రిప్లై ఇచ్చారు. అయితే ChatGPT, Gemini Ai సూసైడ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వట్లేదని పలువురు గుర్తుచేస్తున్నారు.

News March 9, 2026

విజయ్‌కి మరోసారి సీబీఐ నోటీసులు

image

కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్‌కి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలోని తమ కార్యాలయంలో రేపు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోగా 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనవరి 12, 19వ తేదీల్లో సీబీఐ ఆయనను విచారించింది.