News January 7, 2025
Stock Markets: కొంత తేరుకున్నాయ్!
స్టాక్‌మార్కెట్లు మోస్తరు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిన్నటి నష్టాల నుంచి కొంత తేరుకున్నాయి. నిఫ్టీ 23,683 (+70), సెన్సెక్స్ 78,069 (+101) వద్ద ట్రేడవుతున్నాయి. ఆరంభంలో సెన్సెక్స్ 400, నిఫ్టీ 140 పాయింట్ల మేర పెరగడం గమనార్హం. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, డాలర్ ఇండెక్స్, క్రూడాయిల్ ధరలు తగ్గడం పాజిటివ్ సెంటిమెంటుకు దారితీశాయి. IT, MEDIA, AUTO షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది.
Similar News
News January 9, 2025
తిరుపతి బాధితులకు నేడు పరిహారం ప్రకటన
AP: తిరుపతి తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాలకు నేడు CM చంద్రబాబు పరిహారం ప్రకటిస్తారని TTD ఛైర్మన్ B R నాయుడు తెలిపారు. ఘటనపై ఆయన చాలా సీరియస్ అయ్యారని చెప్పారు. టోకెన్ కేంద్రం వద్ద ఉన్న DSP గేట్లు తెరవడంతో భక్తులందరూ తోసుకురావడం వల్లే ఘటన జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనం 19వరకు ఉంటుందని వెల్లడించారు.
News January 9, 2025
మైత్రీ మూవీ మేకర్స్‌పై చర్యలు తీసుకోండి: అడ్వకేట్
మైత్రీ మూవీ మేకర్స్, జై హనుమాన్ చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ తిరుమలరావు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. జై హనుమాన్ మూవీ టీజర్‌లో హనుమంతుడిని కించపరిచేలా సీన్లు ఉన్నాయని ఆరోపించారు. టీజర్‌లో హనుమంతుడికి బదులు రిషబ్ శెట్టి ముఖం చూపించడంతో భవిష్యత్ తరాలకు హనుమాన్ అంటే ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వెంటనే వాటిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
News January 9, 2025
ప్రియాంక, ఆతిశీపై కామెంట్స్.. రమేశ్ బిధూరీ ఎమ్మెల్యే సీటుకు ఎసరు!
కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ, ఢిల్లీ CM ఆతిశీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన BJP నేత రమేశ్ బిధూరీపై ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న ఆయనను తప్పించి, మహిళా అభ్యర్థిని నిలపాలని చూస్తున్నట్లు సమాచారం. కాగా CM ఆతిశీ తన తండ్రినే మార్చేశారని, తాను MLAగా గెలిస్తే నియోజకవర్గ రోడ్లను ప్రియాంక బుగ్గల్లా మారుస్తానని రమేశ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.