News January 7, 2025
కేటీఆర్ పిటిషన్‌పై మొదలైన కోర్టు ప్రొసీడింగ్స్
TG: ఫార్ములా-ఈ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభమయ్యాయి. కాసేపట్లో ఉన్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించనుంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు పూర్తి కాగా తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది.
Similar News
News January 9, 2025
ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉంటాయి: ప్రభుత్వం
AP: ఇంటర్ <<15096013>>ఫస్టియర్ పరీక్షల<<>> రద్దుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఫస్టియర్ పరీక్షలు కాలేజీలు నిర్వహించి, సెకండియర్ ఎగ్జామ్స్ బోర్డు నిర్వహించాలన్నది ప్రతిపాదనే అని తెలిపింది. జనవరి 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తీసుకుంటామని, ఆ తర్వాత తుది నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది.
News January 9, 2025
ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్
శ్రీలంక పర్యటనకు ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్, పేసర్ జోస్ హేజిల్‌వుడ్ గాయాలతో ఈ సిరీస్‌కు దూరమయ్యారు. జట్టుకు సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ నాయకత్వం వహిస్తారు. జట్టు: స్టీవ్ స్మిత్ (C), ఉస్మాన్ ఖవాజా, సామ్ కోన్‌స్టస్, లబుషేన్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కేరీ, జోస్ ఇంగ్లిస్, మెక్‌స్వీనీ, వెబ్‌స్టర్, లయన్, స్టార్క్, కూపర్ కనోల్లీ, మర్ఫీ, ఖునేమాన్, సీన్ అబాట్.
News January 9, 2025
టెన్త్ ఎగ్జామ్ ఫీజు గడువు పొడిగింపు
TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫీజు గడువును సర్కార్ మరోసారి పొడిగించింది. రూ.1,000 ఫైన్‌తో ఈ నెల 22 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. రెగ్యులర్/ప్రైవేట్ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇకపై ఫీజు గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది. మరోవైపు ఫీజు చెల్లించిన విద్యార్థుల జాబితాను ఈ నెల 24లోగా డీఈఓలకు సమర్పించాలని పేర్కొంది. వాటిని డీఈఓలు ఈ నెల 25లోగా తమకు పంపాలని ఆదేశించింది.