News January 7, 2025
కేటీఆర్ పిటిషన్‌పై మొదలైన కోర్టు ప్రొసీడింగ్స్
TG: ఫార్ములా-ఈ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభమయ్యాయి. కాసేపట్లో ఉన్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించనుంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు పూర్తి కాగా తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది.
Similar News
News January 18, 2025
అన్నకు సవాల్ విసిరిన మంచు మనోజ్
మంచు బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం మరింత పెరుగుతోంది. నిన్న కుక్క-సింహం అంటూ ట్వీట్స్ చేసుకున్న ఈ అన్నదమ్ములు.. సై అంటే సై అంటూ ఈరోజు మనోజ్ సవాల్ విసిరారు. ‘దా.. కూర్చుని మాట్లాడుదాం. మహిళలు, నాన్న, స్టాఫ్‌ను పక్కన పెట్టి మనం కలుసుకుందాం. ఒట్టేసి చెబుతున్నా.. నేనొక్కడినే వస్తా. నువ్వు ఎవరినైనా, ఎంతమందినైనా తీసుకొచ్చుకో. లేకపోతే మనం హెల్తీ ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం’ అని ట్వీట్ చేశారు.
News January 18, 2025
గ్రూప్-2 కీ విడుదల
TG: గ్రూప్-2 ప్రిలిమినరీ కీ విడుదలైంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22 సా.5 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో 783 పోస్టుల కోసం గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 నిర్వహించారు. సైట్: <
News January 18, 2025
బీదర్, అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో పురోగతి
బీదర్‌లో <<15169507>>ఏటీఎం డబ్బులు<<>> చోరీ చేసి, HYD అఫ్జల్‌గంజ్‌లో <<15172705>>కాల్పులు జరిపిన<<>> నిందితుల్లో ఒకరిని పోలీసులు గుర్తించారు. బిహార్‌కు చెందిన మనీశ్, మరికొందరు కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారని, ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని ఓ బ్యాంకులో రూ.70లక్షలు చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. మనీశ్, అతని ముఠా కోసం తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ పోలీసులు గాలిస్తున్నారు.