News March 17, 2024
RCBకి పెర్రీ కప్ అందిస్తారా?

WPLలో నేడు ఢిల్లీ, బెంగళూరు ఫైనల్ ఆడనున్నాయి. RCB ఆశలు ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీపైనే ఉన్నాయి. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి బంతికి, బ్యాటుకు పెర్రీ పని చెప్పారు. 312 రన్స్‌తో ఆరెంజ్ క్యాప్ సాధించిన ఆమె బౌలింగ్‌లోనూ ఉత్తమ గణాంకాలు(6/15) నమోదు చేశారు. అయితే ఆమె సెకండ్ అటెంప్ట్‌లోనే ఆస్ట్రేలియాకు ODI WC, T20WC అందించారు. దీంతో రెండో WPLలో RCBకి కప్ అందిస్తారని ఫ్యాన్స్ లెక్కలేస్తున్నారు.
Similar News
News August 19, 2025
రోహిత్, కోహ్లీ.. ప్రాక్టీస్ మొదలెట్టారు!

భారత స్టార్ క్రికెటర్స్ రోహిత్, విరాట్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో రోహిత్ జిమ్‌లో కసరత్తు చేస్తున్న ఫొటో వైరలవుతోంది. మరోవైపు విరాట్ లండన్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఫ్యాన్‌తో దిగిన సెల్ఫీ SMలో హాట్ టాపిక్‌గా మారింది. ‘వరల్డ్ కప్ వేట మొదలైంది’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ AUSతో OCT 19న స్టార్ట్ కానున్న ODI సిరీస్‌లో ఆడే అవకాశముంది.
News August 19, 2025
చైనాలో తైవాన్ భాగమేనని భారత్ చెప్పిందా?

చైనాలో తైవాన్ భాగమేనని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పునరుద్ఘాటించారని చైనా అధికారిక మీడియా Xinhua పేర్కొంది. నిన్న చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీతో భేటీలో ఈ మేరకు జైశంకర్ వ్యాఖ్యానించారని తెలిపింది. మరోవైపు తైవాన్ విషయంలో భారత స్టాండ్‌లో ఎలాంటి మార్పు లేదని, దౌత్య సంబంధాలు కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ అంశంపై భారత్ అధికారికంగా ప్రకటిస్తేనే క్లారిటీ రానుంది.
News August 19, 2025
పద్మజ మరణంపై సీఎం చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి

నందమూరి జయకృష్ణ భార్య పద్మజ <<17450773>>మృతిపై<<>> ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. పద్మజ మరణ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ ఘటన తమ కుటుంబంలో విషాదం నింపిందని తెలిపారు. కుటుంబానికి అన్ని వేళలా అండగా నిలిచిన అత్త ఆకస్మిక మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని లోకేశ్ పేర్కొన్నారు.