News March 17, 2024
RCBకి పెర్రీ కప్ అందిస్తారా?
WPLలో నేడు ఢిల్లీ, బెంగళూరు ఫైనల్ ఆడనున్నాయి. RCB ఆశలు ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీపైనే ఉన్నాయి. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి బంతికి, బ్యాటుకు పెర్రీ పని చెప్పారు. 312 రన్స్‌తో ఆరెంజ్ క్యాప్ సాధించిన ఆమె బౌలింగ్‌లోనూ ఉత్తమ గణాంకాలు(6/15) నమోదు చేశారు. అయితే ఆమె సెకండ్ అటెంప్ట్‌లోనే ఆస్ట్రేలియాకు ODI WC, T20WC అందించారు. దీంతో రెండో WPLలో RCBకి కప్ అందిస్తారని ఫ్యాన్స్ లెక్కలేస్తున్నారు.
Similar News
News October 14, 2024
జోష్‌లో స్టాక్ మార్కెట్లు
వారం ప్రారంభంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 319 పాయింట్లు, నిఫ్టీ 72 పాయింట్ల ప్లస్‌లో ఉన్నాయి. దీంతో సెన్సెక్స్ ప్రస్తుతం 81,666 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25,037 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. JSW స్టీల్, L&T, టాటా స్టీల్, HDFC, అదానీ పోర్ట్స్, రిలయన్స్, NTPC తదితర షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, నెస్లే ఇండియా షేర్లు పడిపోయాయి.
News October 14, 2024
మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు
AP: ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తిరుపతి నుంచి వైజాగ్ వరకు కోస్తా ప్రాంతమంతా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, మచిలీపట్నం, కాకినాడ, విశాఖలో వానలు పడుతున్నాయి. ఈ మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాయలసీమలోని అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాల్లోనూ వానలు ప్రారంభమవుతాయని తెలిపారు.
News October 14, 2024
గాజా పరిస్థితులపై కమలా హారిస్ ట్వీట్
యుద్ధవాతావరణంతో గాజాలోని ప్రజలు ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నారని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. ‘దాదాపు 2 వారాలుగా ఉత్తర గాజాలోకి ఎలాంటి ఆహారం వెళ్లలేదని UN నివేదించింది. అవసరమైన వారికి ఆహారం అందించేలా ఇజ్రాయెల్ అత్యవసరంగా యుద్ధాన్ని నిలిపివేయాలి. పౌరులను రక్షించాలి. ఆహారం, నీరు, మెడిసిన్స్ వారికి అందించాలి. మానవతా చట్టాన్ని గౌరవించండి’ అని ట్వీట్ చేశారు.