News January 7, 2025

బిష్ణోయ్‌తో భయం: సల్మాన్ ఇంటికి బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్

image

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగుతో ముప్పు ఉండటంతో యాక్టర్ సల్మాన్ ఖాన్ మరింత జాగ్రత్తపడుతున్నారు. తన గ్యాలక్సీ అపార్ట్‌మెంటు బాల్కనీ వద్ద భారీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌ను ఇన్‌స్టాల్ చేయించారు. సాధారణంగా ఆయన ఇక్కడి నుంచే ఫ్యాన్స్‌కు చేతులూపి అభివాదం చేస్తుంటారు. కొన్ని నెలల క్రితం ఇక్కడే ఆయనపై బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. అలాగే సల్మాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీని కాల్చిచంపడం తెలిసిందే.

Similar News

News January 9, 2025

తొక్కిసలాటకు కారణం అదే: టీటీడీ ఈవో

image

AP: డీఎస్పీ గేటు తీసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తొక్కిసలాట ఘటన జరిగి ఉంటుందని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. దీనిపై విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందుతోందని స్విమ్స్ వైద్యులు చెప్పారు. ఎవరి ప్రాణాలకూ ముప్పు లేదని, 2-3 రోజుల్లో అందరూ డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.

News January 9, 2025

తిరుపతి తొక్కిసలాట.. సీఎం రాజీనామా చేయాలి: రోజా

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురి చావుకు కారణమైన సీఎం చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ నేత రోజా డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగాన్ని సీఎం పర్యటనకు వినియోగించుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి సామాన్యులంటే ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. ఈ ఘటనలో టీటీడీ ఛైర్మన్, ఈవో, ఎస్పీ, ఇతర అధికారులపై కేసు నమోదు చేయాలన్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలన్నారు.

News January 9, 2025

ఈ నెల 25 తర్వాత సేవలన్నీ నిలిపేస్తాం: ఆశా

image

AP: బకాయిలు చెల్లించకపోతే NTR వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఈ నెల 25 తర్వాత వైద్య సేవలన్నీ నిలిపేస్తామని ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) తెలిపింది. ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్‌తో జరిగిన భేటీలో ఆశా ప్రతినిధులు మాట్లాడుతూ రూ.500కోట్లు విడుదల చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, రూ.1000కోట్లు విడుదల చేస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. 6వ తేదీ నుంచి ఓపీ, EHS సేవలు నిలిపేసిన విషయం తెలిసిందే.