News January 7, 2025

బిష్ణోయ్‌తో భయం: సల్మాన్ ఇంటికి బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్

image

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగుతో ముప్పు ఉండటంతో యాక్టర్ సల్మాన్ ఖాన్ మరింత జాగ్రత్తపడుతున్నారు. తన గ్యాలక్సీ అపార్ట్‌మెంటు బాల్కనీ వద్ద భారీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌ను ఇన్‌స్టాల్ చేయించారు. సాధారణంగా ఆయన ఇక్కడి నుంచే ఫ్యాన్స్‌కు చేతులూపి అభివాదం చేస్తుంటారు. కొన్ని నెలల క్రితం ఇక్కడే ఆయనపై బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. అలాగే సల్మాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీని కాల్చిచంపడం తెలిసిందే.

Similar News

News January 23, 2025

యుద్ధం ఆపాల్సిందే.. పుతిన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

image

ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హెచ్చరించారు. లేదంటే భారీ ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేశారు. రష్యా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై భారీగా పన్నులు, టారిఫ్‌లు విధిస్తామని తెలిపారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఈ వార్ ప్రారంభమయ్యేదే కాదన్నారు. యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని, ఇక నుంచి ఒక్క ప్రాణం కూడా పోయేందుకు వీల్లేదన్నారు.

News January 23, 2025

ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకుంటున్నారా?

image

మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదని నిపుణులు అంటున్నారు. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యేవరకు వెయిట్ చేయకూడదు. 80 శాతానికి చేరుకోగానే అన్‌ప్లగ్ చేయాలి. అలాగే రాత్రి పూట ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోకూడదు. ఫుల్ ఛార్జ్ అయ్యేదాకా లేదా ఎక్కువ గంటలు ప్లగ్ ఇన్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. ఇంకా ఛార్జింగ్ ఎప్పుడూ జీరోకు రాకుండా చూడాలి. 20% కంటే తగ్గకముందే ఫోన్ ఛార్జ్ చేయడం ఉత్తమం.

News January 22, 2025

రేషన్ కార్డుల అంశంపై ప్రభుత్వం అప్రమత్తం

image

TG: రేషన్ కార్డుల జారీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. గ్రామ సభల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్షాలు కావాలనే గొడవ చేస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందుతాయన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు.