News January 7, 2025
ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేపై అభ్యంతరాల గడువు పెంపు

AP: ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేపై అభ్యంతరాల సమర్పణ గడువును ఈ నెల 12 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన గడువు ఇవాళ్టితో ముగియనుండటంతో మరో 5 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సర్వే వివరాలు ప్రచురించి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాల అనంతరం ఈ నెల 20వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నారు.
Similar News
News October 21, 2025
నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు – వాటిని గుర్తించే విధానం

భూమి ద్వారా సంక్రమించే తెగుళ్లు.. విత్తన కుళ్లు, మొలక మాడు, నారు కుళ్లు, వేరు కుళ్లు, మొదలు కుళ్లు, కాండం కుళ్లు, తల కుళ్లు. పంటలో ఈ తెగుళ్లను ముందే గుర్తించేందుకు పొలంలో వేర్వేరు ప్రదేశాల్లో మొక్కలను ఎన్నుకొని, పీకి మెల్లగా మట్టిని తొలగించి శుభ్రం చేయాలి. అప్పుడు వేరు, భూమిలో ఉండే కాండం భాగాల్లో ఏదైనా రంగు మార్పు కనిపిస్తుందేమో చూడాలి. ఏదైనా మార్పు కనిపిస్తే అది వ్యాధి తొలి లక్షణంగా గుర్తించాలి.
News October 21, 2025
నేల ద్వారా వ్యాపించే తెగుళ్ల నివారణకు సూచనలు

వేసవి దుక్కులను నిర్లక్ష్యం చేయకూడదు. పంట మార్పిడి పద్ధతిని ఆచరించాలి. భూమి నుంచి మురుగు నీరు బయటకుపోయేట్లు చూడాలి. వ్యాధి నిరోధక శక్తినిచ్చే పోషకాలను మొక్కలకు అందించాలి. సమగ్ర నీటి పారుదల సౌకర్యాన్ని కల్పించాలి. కలుపు మొక్కల నిర్మూలన చేపట్టాలి. విత్తన శుద్ధి తప్పక చేయాలి. జీవ నియంత్రణ పద్ధతులను పాటించాలి. తెగుళ్ల లక్షణాలను గుర్తించిన వెంటనే నిపుణుల సూచనలతో నివారణ మందులను తప్పక పిచికారీ చేయాలి.
News October 21, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు బీజేపీ అభ్యర్థి దీపక్రెడ్డితో సహా పలువురు నామినేషన్ దాఖలు చేశారు. 150కి పైగా నామినేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు RRR బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ ఐకాస నాయకులు నామినేషన్ వేశారు. రేపు నామినేషన్ల పరిశీలన ఉండనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 24తో ముగుస్తుంది.