News January 7, 2025

ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేపై అభ్యంతరాల గడువు పెంపు

image

AP: ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేపై అభ్యంతరాల సమర్పణ గడువును ఈ నెల 12 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన గడువు ఇవాళ్టితో ముగియనుండటంతో మరో 5 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సర్వే వివరాలు ప్రచురించి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాల అనంతరం ఈ నెల 20వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నారు.

Similar News

News January 25, 2025

నిన్న థియేటర్లలో రిలీజ్.. వారానికే OTTలోకి!

image

మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘ఐడెంటిటీ’కి మలయాళంలో పాజిటివ్ టాక్ రావడంతో శుక్రవారం తెలుగులోనూ రిలీజైంది. తాజాగా ఈ మూవీ OTT రైట్స్ దక్కించుకున్న జీ5 జనవరి 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. అంటే థియేటర్లలో రిలీజైన వారానికే OTTలోకి వస్తుండటం గమనార్హం. మూవీలో టొవినో థామస్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో ఇప్పటి వరకు రూ.18కోట్లకు పైగా వసూలు చేసింది.

News January 25, 2025

దివ్యాంగుల పెన్షన్ల తొలగింపుపై మంత్రి క్లారిటీ

image

AP: అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించబోమని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. వైకల్య స్థాయిని నిర్ధారించేందుకే దివ్యాంగులకు వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నట్లు వివరించారు. వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని, అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతినెలా దివ్యాంగులకు రూ.6వేలు, పూర్తిగా మంచంలో ఉన్నవారికి రూ.15వేలు పెన్షన్ అందజేస్తోన్న విషయం తెలిసిందే.

News January 25, 2025

రైతు భరోసా.. వాళ్లకు గుడ్‌న్యూస్!

image

TG: రేపటి నుంచి రైతు భరోసా అమలుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం కొత్తగా పాస్‌బుక్‌లు పొందినవారికి గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1వ తేదీ వరకు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ అయిన వారి కోసం రైతుభరోసా సైట్‌‌లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చారు. వారంతా తమ పాస్‌బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏఈవోలకు ఇస్తే వాటిని అప్‌లోడ్ చేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో రైతుబంధు రాని వారు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు.