News January 8, 2025
వారి ఎక్స్‌గ్రేషియా రూ.5లక్షలకు పెంపు

AP: ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.4 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.5లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు చేనేత, చేతి వృత్తులు చేసుకునే వారు ముంపుబారిన పడితే ఇచ్చే సాయాన్ని రూ.10వేల నుంచి రూ.25వేలకు పెంచారు. అలాగే విపత్తుల వేళ నీట మునిగిన ద్విచక్రవాహనాలకు రూ.3వేలు, ఆటోలకు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించింది.
Similar News
News August 22, 2025
ఆ కుక్కలను వదలకండి: సుప్రీంకోర్టు

ఢిల్లీలో వీధికుక్కలపై ఆగస్టు 11న ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించింది. షెల్టర్లకు తరలించిన కుక్కలకు స్టెరిలైజ్, ఇమ్యునైజేషన్ తర్వాత బయట ప్రదేశాల్లో వదిలేయాలని సూచించింది. రేబిస్ సోకిన, దూకుడుగా ఉండే కుక్కలను వదలవద్దని ఆదేశించింది. వీధికుక్కలకు బహిరంగంగా ఆహారం పెట్టవద్దని ఆదేశించింది. ఆహారం ఇచ్చేందుకు కొన్ని ప్రదేశాలను ఎంపిక చేయాలని సూచించింది. దేశవ్యాప్తంగా ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది.
News August 22, 2025
చిరంజీవికి నారా లోకేశ్, అల్లు అర్జున్ విషెస్

మెగాస్టార్ చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి పుట్టిన రోజు <<17480281>>శుభాకాంక్షలు<<>> వెల్లువెత్తుతున్నాయి. ‘సినిమా, సమాజానికి మీరు చేసిన అద్భుతమైన కృషి గర్వకారణం, స్ఫూర్తిదాయకం’ అని మంత్రి లోకేశ్, ‘వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. వీరితో పాటు తెలుగు రాష్ట్రాల మంత్రులు, సినీ హీరోలు, దర్శకులు విషెస్ తెలియజేస్తున్నారు.
News August 22, 2025
ప్రకాశ్ రాజ్ ట్వీట్ చంద్రబాబు, పవన్ గురించేనా?

క్రిమినల్ కేసుల్లో అరెస్టయి 30రోజులు జైల్లో ఉంటే PM, CMల పదవి పోయేలా కేంద్రం <<17465755>>కొత్త బిల్లును<<>> తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తనకో చిలిపి సందేహం కలిగిందని నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ‘మాజీ సీఎం కానీ ప్రస్తుత CM కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి, “మీ మాట వినే ఉపముఖ్యమంత్రిని” CM చేసే కుట్ర ఏమైనా ఉందా?’ అని ప్రశ్నించారు. ఆయన ఈ ట్వీట్‌ను తెలుగులో చేయడంతో ఇది AP గురించేనని చర్చ మొదలైంది.