News January 8, 2025
వారి ఎక్స్‌గ్రేషియా రూ.5లక్షలకు పెంపు
AP: ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.4 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.5లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు చేనేత, చేతి వృత్తులు చేసుకునే వారు ముంపుబారిన పడితే ఇచ్చే సాయాన్ని రూ.10వేల నుంచి రూ.25వేలకు పెంచారు. అలాగే విపత్తుల వేళ నీట మునిగిన ద్విచక్రవాహనాలకు రూ.3వేలు, ఆటోలకు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించింది.
Similar News
News January 21, 2025
నుమాయిష్‌లో ఉచిత పార్కింగ్ ఇవ్వాలి: రాజాసింగ్
HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏటా నిర్వహిస్తున్న నుమాయిష్‌ను నగర శివార్లకు తరలించాలని CM రేవంత్ రెడ్డిని BJP MLA రాజాసింగ్ కోరారు. నగరం మధ్యలో జరుగుతున్న ఎగ్జిబిషన్‌కు వేలాదిగా ప్రజలు తరలిరావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందని, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. మరోవైపు పార్కింగ్ పేరుతో దోచుకుంటున్నారని, ప్రభుత్వ స్థలంలో జరుగుతున్న ఎగ్జిబిషన్‌కు ఉచితంగా పార్కింగ్ కల్పించాలని కోరారు.
News January 21, 2025
పాల డబ్బా కింద పడిందని రాహుల్ గాంధీపై కేసు
బిహార్‌కు చెందిన ముకేశ్ కుమార్ అనే పాల వ్యాపారి రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘దేశంలోని ప్రతి వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్న BJP, RSSలపై పోరాడుతున్నాం’ అని రాహుల్ చేసిన వ్యాఖ్యలతో తాను ఒక్కసారిగా షాక్‌కు గురి అయ్యానన్నాడు. దీంతో చేతిలో ఉన్న పాల డబ్బా కిందపడిందని.. 5 లీటర్ల పాలు నేలపాలయ్యాయని చెప్పాడు. రూ.250 నష్టం జరిగిందంటూ ఈ ఘటనకు కారణమైన రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశాడు.
News January 21, 2025
జనవరి 28న ఆ స్కూళ్లకు సెలవు
తెలంగాణలో జనవరి 28న మైనార్టీ స్కూళ్లకు సెలవు ఉండనుంది. ముస్లిం క్యాలెండర్ ప్రకారం ఆ రోజు ‘షబ్ ఎ మెరజ్’ కావడంతో ప్రభుత్వం ఇప్పటికే ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. దీంతో మైనార్టీ విద్యాసంస్థలు ఈ సెలవును ఇవ్వనుండగా మిగతా స్కూళ్లు క్లాసుల నిర్వహణ లేదా హాలిడేపై సొంతంగా నిర్ణయం తీసుకోనున్నాయి.