News January 9, 2025

తక్షణమే టోకెన్ల జారీ.. కేంద్రాల వద్ద అదనపు బలగాలు

image

తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మరణించడంతో టీటీడీ అప్రమత్తమైంది. రద్దీ పెరగడంతో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను తక్షణమే జారీ చేయాలని నిర్ణయించింది. భక్తులను అదుపు చేసేందుకు అన్ని కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. పరిస్థితిని ఎస్పీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆయనతో హోంమంత్రి అనిత ఫోన్‌లో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సూచించారు.

Similar News

News August 18, 2025

కేసీఆర్ వల్లే బీసీ రిజర్వేషన్లు ఆగాయి: రేవంత్

image

TG: కేసీఆర్ 2018లో తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టం BC రిజర్వేషన్ల పెంపుకు అడ్డుగా మారిందని సీఎం రేవంత్ అన్నారు. ‘BCలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ తెచ్చాం. అది మన గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. కేసీఆర్ తెచ్చిన చట్టంలో రిజర్వేషన్లు 50% మించకూడదని ఉంది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో దానిపై ఆర్డినెన్స్ తెచ్చాం’ అని తెలిపారు.

News August 18, 2025

యూరియా కోసం కాంగ్రెస్ MPల నిరసన

image

TG: రాష్ట్రంలో యూరియా కొరత నేపథ్యంలో ఢిల్లీలోని పార్లమెంటు భవనం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. తెలంగాణకు రావాల్సిన యూరియాను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు కేంద్రమంత్రి నడ్డాను కలిసి రాష్ట్రానికి సరిపడా యూరియా కేటాయించాలని వారు కోరనున్నారు. యూరియాపై జీరో అవర్‌లో ప్రస్తావించాలని ఎంపీలు నిర్ణయించారు.

News August 18, 2025

వర్షాలు ఎక్కువైతే సెలవులు పొడిగిస్తాం: మంత్రి సంధ్యారాణి

image

AP: వర్షాలు ఎక్కువగా ఉంటే పాఠశాలలకు సెలవులు పొడిగిస్తామని మంత్రి సంధ్యారాణి చెప్పారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై ప్రభుత్వం సమీక్షిస్తోందని తెలిపారు. ఏడాదిలోనే దాదాపు రూ.1,300 కోట్లు రహదారుల అభివృద్ధికే వినియోగించామన్నారు. రాబోయే 3 ఏళ్లలో గిరిజన ప్రాంతాల్లో మెజారిటీ రహదారులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాలకు ఇవాళ సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.