News March 17, 2024
అద్దంకిలో బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

అద్దంకి మండలం అమ్మాయిపాలెం గ్రామ సమీపంలో ఆదివారం ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సు బోల్తా పడి 15 మందికి గాయాలయ్యాయి. బొద్దికూరపాడుకు చెందిన సుబ్బారెడ్డి తమ కుటుంబ సభ్యులతో మనవరాలు పుట్టువెంట్రుకలు తీసుకునేందుకు బస్సులో కోటప్పకొండకు వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను బయటకు తీసి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Similar News
News April 3, 2025
ప్రకాశం జిల్లా వాసులకు వాతావరణ శాఖ హెచ్చరికలు

ప్రకాశం జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. గురువారం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాలలో ఉండరాదని హెచ్చరించారు. సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని అధికారులు పేర్కొన్నారు.
News April 3, 2025
వెలిగండ్ల: ఇమ్మడి చెరువు సర్పంచ్ ఆత్మహత్య

వెలిగండ్ల మండలంలోని ఇమ్మడి చెరువు గ్రామ సర్పంచ్ తోకల బాలకృష్ణ(37) గురువారం ఉదయం బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వైసీపీ తరఫున సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. బాలకృష్ణ మృతి పట్ల మండలంలోని పలువురు వైసీపీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 3, 2025
ఒంగోలు: 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి

పెళ్లి చేసుకుంటానని నమ్మించి 15 ఏళ్ల బాలికపై ఓ యువకుడు పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన ఒంగోలులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. నానమ్మ వద్ద ఉంటున్న బాలికకు యువకుడు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. బాలికకు అనారోగ్యంగా ఉండటంతో జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు గర్భవతిగా తేల్చారు. దీంతో బాలిక నానమ్మ ఒంగోలు వన్ టౌన్లో ఫిర్యాదు చేసింది.