News March 17, 2024
అద్దంకిలో బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

అద్దంకి మండలం అమ్మాయిపాలెం గ్రామ సమీపంలో ఆదివారం ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సు బోల్తా పడి 15 మందికి గాయాలయ్యాయి. బొద్దికూరపాడుకు చెందిన సుబ్బారెడ్డి తమ కుటుంబ సభ్యులతో మనవరాలు పుట్టువెంట్రుకలు తీసుకునేందుకు బస్సులో కోటప్పకొండకు వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను బయటకు తీసి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Similar News
News April 24, 2025
పొదిలి: రోడ్డుపై మద్యం లారీ బోల్తా.. ఎగబడ్డ జనం

పొదిలి మండలం సలకనూతల వద్ద మార్కాపురం నుంచి దర్శికి మద్యం లోడ్‌తో వెళుతున్న వాహనం బుధవారం ప్రమాదానికి గురై రోడ్డుపై బొల్తాపడింది. మద్యం బాటిళ్లు రోడ్డుపై పడగా.. మద్యం ప్రియులు వాటి కోసం ఎగబడ్డారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు.
News April 24, 2025
ఒంగోలు: రేషన్ మాఫియా డాన్ పనేనా..?

వీరయ్య చౌదరి హత్య కేసులో ఓ రేషన్ మాఫియా డాన్ పేరు బలంగా వినిపిస్తోంది. ఒంగోలులో హత్య తర్వాత అతను ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. వాహనాలు మారుస్తూ గుంటూరు(D) వెదుళ్లపల్లికి వెళ్లి అక్కడ ఓ రైస్ మిల్లర్ నుంచి డబ్బులు తీసుకెళ్లినట్లు సమాచారం. ఆ మిల్లర్ సమాచారంతో డాన్‌కు సహకరించారన్న అనుమానాలతో నిడుబ్రోలుకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, వీళ్లు ఎన్నికల్లో YCPకి అనుకూలంగా పనిచేశారని సమాచారం.
News April 24, 2025
అర్థవీడులో పులి సంచారం

అర్ధవీడు మండల పరిసర ప్రాంతాల్లో పెద్ద పులుల సంచారం నిజమేనని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. రెండు రోజుల క్రితం మొహిద్దిన్ పురం సమీపంలో రోడ్డుపై పెద్దపులి కనిపించగా స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి అధికారులు తనిఖీలు చేశారు. స్థానికంగా కనిపించిన గుర్తుల ఆధారంగా ఈ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లుగా డీఆర్వో ప్రసాద్ రెడ్డి బుధవారం నిర్ధారించారు.